Infinix Hot 20 5G: రూ.15 వేలలోపే ఇన్‌ఫీనిక్స్ 5జీ ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గురువారం లాంచ్ అయింది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫేజ్ ఛేంజ్ కూలింగ్ సిస్టంను ఇందులో అందించారు. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ ధర
ఇందులో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 179.9 డాలర్లుగా (రూ.15,000) ఉంది. బ్లాస్టర్ గ్రీన్, రేసింగ్ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను 60 హెర్ట్జ్, 90 హెర్ట్జ్, 120 హెర్ట్జ్‌ల మధ్య మార్చుకోవచ్చు. ఇక టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఆటో స్విచ్ మోడ్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. మూడు రోజుల పాటు ఈ బ్యాటరీ బ్యాకప్ రానుందని కంపెనీ తెలిపింది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ పని చేయనుంది. ఈ ఫోన్ 5జీని కూడా సపోర్ట్ చేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram