By: ABP Desam | Updated at : 15 Apr 2022 04:37 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 2022 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: Infinix)
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 2022 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన ఇన్‌ఫీనిక్స్ హాట్ 11కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీంతోపాటు 64 జీబీ స్టోరేజ్ కూడా అందించారు. రియల్‌మీ సీ31, పోకో ఎం3, రెడ్‌మీ 10లతో ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 పోటీ పడనుంది.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 2022 ధర
ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. అరోరా గ్రీన్, పోలార్ బ్లాక్, సన్‌సెట్ గోల్డ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 2022 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 89.53 శాతంగా ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనుంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా... బరువు 199.6 గ్రాములుగా ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Redmi Note 11T: రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ వచ్చేస్తుంది - బడ్జెట్ ధరలోనే సూపర్ 5జీ ఫోన్లు!
Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!