అన్వేషించండి

కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన హానర్ - 50 మెగాపిక్సెల్ కెమెరాతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్ హానర్ ఎక్స్6ను లాంచ్ చేసింది.

హానర్ ఎక్స్6 స్మార్ట్ ఫోన్ సౌదీ అరేబియాలో లాంచ్ అయింది.  ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. అయితే దీని ధరను మాత్రం కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

సౌదీ అరేబియాలో మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర సీక్రెట్‌గానే ఉంచినా ఫీచర్లను మాత్రం కంపెనీ వెబ్ సైట్ రివీల్ చేసింది. 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.

హానర్ ఎక్స్6 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720x1,600 పిక్సెల్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. 4 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు డెప్త్ సెన్సార్, మాక్రో సెన్సార్‌లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఓటీజీ సపోర్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి. గ్రావిటీ సెన్సార్, యాంబియంట్  లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 194 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ROGRTEC (@rogrtec)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP DesamTimelapse of leaves emerging in space | స్పేడెక్స్ ఉపగ్రహంలో వ్యవసాయం సక్సెస్ | ABP DesamIndias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
PM Modi News: విశాఖలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే- లోకేష్‌ నమో నమః స్పీచ్‌
విశాఖలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే- లోకేష్‌ నమో నమః స్పీచ్‌
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Fake Customer Care Calls: ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
Embed widget