News
News
X

Honor X40: సూపర్ డిస్‌ప్లేతో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన హానర్ - రూ.17 వేలలోనే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే హానర్ ఎక్స్40.

FOLLOW US: 

హానర్ ఎక్స్40 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ చైనాలో లాంచ్ అయింది. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఏకంగా 107 కోట్ల రంగులను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై హానర్ ఎక్స్40 పని చేయనుంది.

హానర్ ఎక్స్40 ధర
ఇందులో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా (సుమారు రూ.17,100) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,699 యువాన్లుగానూ (సుమారు రూ.19,400), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,999 యువాన్లుగానూ (సుమారు రూ.22,800) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగా (సుమారు రూ.26,200) నిర్ణయించారు. ఛేజింగ్ ది మూన్, మ్యాజిక్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

హానర్ ఎక్స్40 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,080x2,400 పిక్సెల్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 107 కోట్ల రంగులకు సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ డిస్‌ప్లేలో ఉన్నాయి. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రన్ అవ్వనుంది. అడ్రెనో 619 జీపీయూతో దీన్ని పెయిర్ చేశారు.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ర్యామ్‌ను మరో 7 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో 19 జీబీ వరకు ర్యామ్ ఉండనుందన్న మాట. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్, కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2డీ ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ కూడా ఉంది. 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 40W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లను అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 172 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 18 Sep 2022 05:08 PM (IST) Tags: Honor New Phone Honor X40 Price Honor X40 Honor X40 Specifications Honor X40 Features Honor X40 Launched

సంబంధిత కథనాలు

Tecno Pova 5G Amazon Offer: రూ.15 వేలలోపే సూపర్ 5జీ ఫోన్ - 10000 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్ ఫ్రీ - అమెజాన్‌లో బంపర్ ఆఫర్

Tecno Pova 5G Amazon Offer: రూ.15 వేలలోపే సూపర్ 5జీ ఫోన్ - 10000 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్ ఫ్రీ - అమెజాన్‌లో బంపర్ ఆఫర్

iOS 16లో బ్యాటరీ ప్రాబ్లమ్స్ - అప్‌డేట్ చేసేముందు జరభద్రం!

iOS 16లో బ్యాటరీ ప్రాబ్లమ్స్ - అప్‌డేట్ చేసేముందు జరభద్రం!

Xiaomi Civi 2: షావోమీ కొత్త ఫోన్ వచ్చేసింది - సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్, సోనీ కెమెరాతో!

Xiaomi Civi 2: షావోమీ కొత్త ఫోన్ వచ్చేసింది - సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్, సోనీ కెమెరాతో!

Infinix Note 12 2023: ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది - రూ.14 వేలలోనే సూపర్ ఫీచర్లు!

Infinix Note 12 2023: ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది - రూ.14 వేలలోనే సూపర్ ఫీచర్లు!

Xiaomi 12T: షావోమీ 12టీ సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - లాంచ్ త్వరలోనే!

Xiaomi 12T: షావోమీ 12టీ సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - లాంచ్ త్వరలోనే!

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ