News
News
X

Honor X40 GT: త్వరలో హానర్ కొత్త ఫోన్ - సూపర్ ప్రాసెసర్‌తో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయనుంది. అదే హానర్ ఎక్స్40 జీటీ.

FOLLOW US: 
 
హానర్ ఎక్స్40 జీటీ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 13వ తేదీన లాంచ్ కావడానికి రెడీ అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా కంపెనీ షేర్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీంతోపాటు ఈ ఫోన్ లైవ్ ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

భారతదేశ కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్ పోస్టర్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది. ఈ టీజర్ పోస్టర్‌ను చూస్తే ఫోన్ వెనకవైపు పెద్ద కెమెరా రింగ్ ఉంది. మొత్తంగా మూడు కెమెరాలు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే ధర మాత్రం తెలియరాలేదు. స్పెసిఫికేషన్ల విషయంలో కూడా హానర్ సీక్రసీ మెయింటెయిన్ చేస్తుంది. గతంలో హానర్ ఎక్స్40 1,499 యువాన్ల (సుమారు రూ.17,100) ధరతో లాంచ్ అయింది.

హానర్ ఎక్స్40 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,080x2,400 పిక్సెల్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 107 కోట్ల రంగులకు సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ డిస్‌ప్లేలో ఉన్నాయి. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రన్ అవ్వనుంది. అడ్రెనో 619 జీపీయూతో దీన్ని పెయిర్ చేశారు.

News Reels

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ర్యామ్‌ను మరో 7 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో 19 జీబీ వరకు ర్యామ్ ఉండనుందన్న మాట. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్, కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2డీ ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ కూడా ఉంది. 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 40W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లను అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 172 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 10 Oct 2022 11:46 PM (IST) Tags: Honor New Phone Honor X40 GT Price Honor X40 GT Honor X40 GT Specifications Honor X40 GT Features Honor X40 GT Launched

సంబంధిత కథనాలు

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

టాప్ స్టోరీస్

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

Pawan Kalyan Next Movie: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?

Pawan Kalyan Next Movie: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది