Honor 80: 200 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - 100W ఫాస్ట్ చార్జింగ్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన 80 సిరీస్ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
హానర్ 70 సిరీస్‌కు తర్వాతి వెర్షన్ త్వరలో లాంచ్ కానుంది. అదే హానర్ 80 సిరీస్. ఈ సిరీస్‌లో హానర్ 80, హానర్ 80 ప్రో, హానర్ 80 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కంపెనీ దీన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. మోడల్‌ను బట్టి ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు ఉండనున్నాయి.
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలుపుతున్న దాని ప్రకారం... హానర్ 80లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. హానర్ 80 ప్రోలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు.
ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన హానర్ 80 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 1.5కే అమోఎల్ఈడీ ఫ్లెక్సిబుల్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను హానర్ 80 ప్రో ప్లస్‌లో ఉండనుంది. 12 జీబీ వరకు ర్యామ్ అందించనున్నారు.
అయితే హానర్ మాత్రం తన 80 సిరీస్‌కు సంబంధించిన వివరాలు ప్రకటించలేదు. ఈ స్మార్ట్ ఫోన్లు చైనాలో ఈ సంవత్సరం చివర్లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హానర్ 70 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మలేషియాలో లాంచ్ అయింది. దీని ధరను 1,999 మలేషియన్ రింగెట్లుగా (సుమారు రూ.35,600) నిర్ణయించారు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై హానర్ 70 5జీ పనిచేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 178 గ్రాములు మాత్రమే.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 54 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్800 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు యాంబియంట్ లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేన్ అన్‌లాక్ ఫీచర్లను సెక్యూరిటీ కోసం అందించారు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?