By: ABP Desam | Updated at : 11 Sep 2022 06:17 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
గూగుల్ పిక్సెల్ 6ఏ ధరను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గించారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో కొన్ని అద్భుతమైన డీల్స్‌ను కంపెనీ ప్రకటించింది. ఇందులో గూగుల్ పిక్సెల్ 6ఏపై భారీ ఆఫర్‌ను ప్రకటించారు. ఈ ఫోన్‌ను రూ.28 వేల ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.
బిగ్ డీల్స్‌ను రివీల్ చేయడంలో భాగంగా పిక్సెల్ 6ఏ ఆఫర్ ధరను కంపెనీ రివీల్ చేసింది. ఈ లిస్టింగ్ ప్రకారం రూ.43,999 విలువైన గూగుల్ పిక్సెల్ 6ఏను రూ.27,699కే కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లు కూడా తీసేశాక ఈ ధరకు లభించనుందని మాత్రం అర్థం అవుతుంది.
ఫ్లిప్‌కార్ట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు తగ్గింపు లభించనుంది. అయితే తగ్గింపు, బ్యాంక్ ఆఫర్లు అన్నీ పోయాక రూ.27,699కు లభిస్తుందా? ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండానే ఈ ధరకు లభిస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను గూగుల్ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆక్టాకోర్ గూగుల్ టెన్సార్ చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్లను గూగుల్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12.2 మెగాపిక్సెల్ కాగా... 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గూగుల్ పిక్సెల్ 6ఏలో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4410 ఎంఏహెచ్ కాగా... ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా గూగుల్ పిక్సెల్ 6ఏ సపోర్ట్ చేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
iPhone 15: నేటి నుంచి ఐఫోన్ 15 విక్రయాలు, యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం!
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!
Andriod: మీ స్మార్ట్ ఫోన్ డేటా వెంటనే అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి
YouTube Music: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!
Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
/body>