అన్వేషించండి

Coolpad Cool 20s 5G: రూ.11 వేలలోనే కొత్త 5జీ ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కూల్‌ప్యాడ్ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ.

కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. కూల్‌ప్యాడ్ కూల్ 20 సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో కూల్ 20, కూల్ 20 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇది ఒక చవకైన 5జీ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ ధర
కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ ధర చైనాలో 999 యువాన్ల (సుమారు రూ.11,500) నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సేల్ జూన్ 17వ తేదీ నుంచి జరగనుంది. 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. అజూర్ బ్లూ, ఫైర్‌ఫ్లై బ్లాక్ మూన్, షాడో వైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. కూల్‌ప్యాడ్ బ్రాండ్ మనదేశంలో ఒకప్పుడు చాలా ఫేమస్ కాబట్టి ఈ ఫోన్ కూడా మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కూల్ ఓఎస్ 20 ఆపరేటింగ్ సిస్టంపై కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ పనిచేయనుంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 91.2 శాతంగానూ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. దీని వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లుగానూ, బరువు 180 గ్రాములుగానూ ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
US Iran War Code 100: అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
Embed widget