BSNL కొత్త ఆఫర్.. కేవలం 1 రూపాయితో ప్రతిరోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్
BSNL New Plan: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా BSNL చవక ప్లాన్ ఆఫర్లను ప్రకటించింది. రూ.1కే అన్ లిమిటెడ్ కాలింగ్, రోజూ 2 జీబీ డేటా ఇస్తామని తెలిపింది.

BSNL offer: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ఒక చాలా చవకైన, ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద, కేవలం 1 రూపాయికి, కస్టమర్‌లకు 28 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాతో పాటు ప్రతిరోజూ 100 SMS ఉచితంగా లభిస్తాయి. ఈ ఆఫర్ ముఖ్యంగా కొత్త BSNL కస్టమర్‌ల కోసం అని ప్రకటించింది. కంపెనీ అప్‌గ్రేడ్ చేసిన నెట్‌వర్క్‌ను ఎక్కువ మందికి చేరవేయడం దీని లక్ష్యం.
BSNL కొత్త 'ఫ్రీడమ్ ఆఫర్'
BSNL ఈ ఆఫర్ గురించి తన అధికారిక X ఖాతాలో ఇటీవల సమాచారం అందించింది, ఇక్కడ దీనికి 'రియల్ డిజిటల్ ఇండిపెండెన్స్' అని పేరు పెట్టారు. కస్టమర్‌లు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు కొత్త BSNL సిమ్‌ను తీసుకున్నట్లు అయితే కేవలం 1 రూపాయి రీఛార్జ్‌తో వారికి 30 రోజుల పాటు ఈ ఆఫర్ లో పేర్కొన్న సౌకర్యాలు లభిస్తాయి. ఈ పథకంలో నేషనల్ రోమింగ్‌తో సహా దేశవ్యాప్తంగా అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా , 100 SMS ఉన్నాయి.
BSNL’s Freedom Offer - Only @ ₹1!
— BSNL India (@BSNLCorporate) August 1, 2025
Enjoy a month of digital azadi with unlimited calls, 2GB/day data 100 SMS & Free SIM.
Free SIM for New Users.#BSNL #DigitalIndia #IndependenceDay #BSNLFreedomOffer #DigitalAzadi pic.twitter.com/aTv767ETur
ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు అందుబాటులో ఉండనుంది. దేశంలోని అన్ని సర్కిల్‌లలో బీఎస్‌ఎన్ఎల్ ఆఫర్ అమలు చేసింది. కస్టమర్‌లు BSNL ఏదైనా అధీకృత కేంద్రం నుంచి కేవలం 1 రూపాయికి కొత్త సిమ్ కార్డ్‌ను తీసుకొని ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు.
తగ్గుతున్న వినియోగదారుల సంఖ్య పెంచే ప్రయత్నం
TRAI తాజా నివేదిక ప్రకారం, గత కొన్ని నెలల్లో BSNL, Vi నుండి లక్షలాది మంది వినియోగదారులు ఇతర టెలికాం కంపెనీలకు పోర్ట్ అయ్యారు. తగ్గుతున్న వినియోగదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, మార్కెట్‌లో తన వాటాను తిరిగి బలోపేతం చేయడానికి BSNL ఈ ప్లాన్ తీసుకొచ్చింది.
ప్రభుత్వం BSNLకి Average Revenue Per User (ARPU) పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే దీని కోసం టారిఫ్ ధరలను పెంచకూడదని కూడా సంస్థ ఆదేశించింది. ఇప్పుడు ప్రతి నెలా దీనిపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. తద్వారా కొత్త కస్టమర్ల సంఖ్యను పెంచడానికి రెగ్యూలర్ గా పర్యవేక్షించవచ్చు.
Airtel కొత్త ప్లాన్
Airtel ఇటీవల కొత్త 399 రూపాయల ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ చెల్లుబాటు 28 రోజులు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, ఉచిత జాతీయ రోమింగ్ (జమ్మూ కాశ్మీర్‌ను మినహాయించి) సౌకర్యం కల్పించింది. వినియోగదారులు రోజుకు 2.5GB డేటాతో పాటు 100 SMS ఉచితంగా పొందుతారు. ఈ BSNL ప్లాన్‌లో 28 రోజుల పాటు JioHotstar ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది, ఇది OTT కంటెంట్ చూసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.






















