అన్వేషించండి

BSNL సరికొత్త ప్లాన్స్.. తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనం.. ఎయిర్‌టెల్, జియోలకు గట్టి పోటీ ఖాయం

BSNL తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాతో Airtel, Jio లకు పోటీ ఇస్తోంది. చవకైన, మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ చర్యలు చేపట్టింది.

BSNL Recharge Plan | ఎన్నో నష్టాల తర్వాత BSNL రికవర్ అవుతోంది. ప్రభుత్వం యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల లాభాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. BSNL తమ పాత వినియోగదారులను మళ్లీ ఆకర్షించడానికి, ఇతర టెలికాం యూజర్లను ఆకర్షించడానికి సన్నద్ధమైంది. ఈ క్రమంలో BSNL కంపెనీ చాలా తక్కువ ధరలకే, వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త రీచార్జ్ ప్లాన్స్ ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, Jioలకు సవాలు విసురుతున్నాయి.

₹147కి అపరిమిత కాల్స్, ఇంటర్నెట్ డేటా!

BSNL తీసుకొచ్చిన 147 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ముఖ్యంగా ఇంటర్నెట్ కంటే కాల్స్ ఎక్కువగా చేసే వినియోగదారులకు బెనిఫిట్ అవుతుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో యూజర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తుంది. అదనంగా వీరికి 10GB ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా మీకు నచ్చిన విధంగా ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. డైలీ లిమిట్ లేదు, మీరు కోరుకుంటే మొత్తం డేటాను ఒక రోజులో వాడేయవచ్చు. లేకపోతే వ్యాలిడిటీ ఉన్న నెల రోజుల పాటు  ఉపయోగించవచ్చు.

 డేటా కోసం బెస్ట్ ₹247 ప్లాన్

మీకు కాల్స్ మాత్రమే కాదు, ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించేవారు అవసరమైతే BSNL ₹247 ప్లాన్ బెస్ట్ ఛాయిస్. ఈ ప్లాన్ కూడా 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ  డేటా ప్యాక్ ద్వారా వినియోగదారులకు 50GB డేటా, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లోనూ డేటా వినియోగానికి ఎలాంటి రోజువారీ లిమిట్ లేదు. వ్యాలిడిటీ గడువులోపు మీకు కావాల్సిన సమయంలో, ఆ డేటాను ఒకేసారి సైతం ఉపయోగించవచ్చు.

తక్కువ ధర, ఎక్కువ ప్రయోజనాలు

BSNL ఈ ప్లాన్లు.. ప్రైవేట్ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, జియోల ధరలతో పోల్చితే తక్కువే అని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ కంపెనీలు డేటా, వాయిస్ కాల్స్ కోసం వినియోగదారుల నుండి ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నాయి. కానీ BSNL తక్కువ ధరలకు కస్టమర్లకు మంచి ప్లాన్ ప్యాకేజీని అందిస్తోంది. BSNL తన నెట్‌వర్క్ నాణ్యతను కొంచెం మెరుగుపరుచుకుంటే Airtel, Jio వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. 

BSNL యొక్క ఈ ప్రయత్నం వినియోగదారులను మళ్ళీ ఆకర్షించడంలో మంచి అడుగు అయితే, టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీని కూడా ప్రోత్సహిస్తుంది. BSNL యొక్క ఈ కొత్త ప్లాన్లు మార్కెట్‌లో ఎంత ప్రభావం చూపుతాయో మరియు ఇది కంపెనీ లాభాలను మరింత వేగవంతం చేస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Embed widget