By: ABP Desam | Updated at : 09 Jun 2023 01:59 PM (IST)
Photo Credit: Pixabay
సెల్ ఫోన్ వినియోగదారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సెల్ ఫోన్ పోగొట్టుకున్న వినియోగదారుల చెంతకు వాటిని సురక్షితంగా చేరవేర్చే లక్ష్యంతో CEIR అనే పోర్టల్ ను ప్రారంభించింది. తాజాగా మాల్వేర్ తో ఇబ్బంది పడే వినియోగదారుల కోసం సరికొత్త రిమూవల్ టూల్ అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ పేరుతో దీనిని వినియోగదారుల చెంతకు తీసుకొచ్చింది. ఈ టూల్ సాయంతో సెల్ ఫోన్ లోని మాల్వేర్ ను స్కాన్ చేయడంతో పాటు తొలగించే అవకాశం ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ ఈ కొత్త టూల్ ను రూపొందించింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ గురించి వినియోగదారులలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. సెల్ ఫోన్ వినియోగదారులకు ఎస్సెమ్మెస్ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. సైబర్ మోసాల నుంచి సురక్షితంగా ఉండాలని, ఆయా డివైజ్ లను రక్షించేందుకు భారత ప్రభుత్వం ద్వారా రూపొందించబడిన ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. ఈ టూల్ ద్వారా ఎవ్వరైనా తమ సెల్ ఫోన్ లోని మాల్వేర్ ను తీసివేసుకునే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి గత కొంత కాలంగా సైబర్ మోసాలు బాగా పెరిగాయి. ప్రమాదకరమైన మాల్వేర్స్ టార్గెట్ చేసుకున్న కంప్యూటర్లు, సెల్ ఫోన్లలోకి మాల్వేర్స్ పంపించి వాటిని క్లిక్ చేయడానికి ఆయా డివైజెస్ లోని డేటా అంతటిని సైబర్ కేటుగాళ్లు తస్కరిస్తున్నారు. ముందుగా స్పామ్ మెసేజ్ పంపడం, వాటి గురించి సరిగా తెలియని వినియోగదారులు లింక్ క్లిక్ చేయగానే ఫోన్ పూర్తిగా హ్యాకర్ల కంట్రోల్ లోకి వెళ్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ ద్వారా, వినియోగదారులు తమ సెల్ ఫోన్లలోని మాల్వేర్స్ ను గుర్తించడంతో పాటు తొలగించే అవకాశం ఉంటుంది.
ఈ టూల్ ను మోబైల్ తో పాటు ప్యూటర్లు, ట్యాబ్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. సేమ్ సెల్ ఫోన్ మాదిరిగానే ఆయా డివైజెస్ లో రన్ చేసి, మాల్వేర్స్ ను గుర్తించడంతో పాటు రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టూల్ అత్యంత సురక్షితమైనది కావడంతో పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ టూల్ ఎంతో సమర్థవంతంగా మాల్వేర్స్ ను ఎదుర్కొంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?
Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!
Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!
Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!
ChatGPT యూజర్లు ఇకపై AI చాట్బాట్తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?
Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
/body>