By: ABP Desam | Updated at : 06 Jun 2023 12:46 PM (IST)
ChatGPT (Photo Credit: Pixabay)
ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే Chat GPT చక్కటి ఆదరణ దక్కించుకుంది. కచ్చితమైన సమాచారం, వెంటనే అందించే లా రూపొందించిన Chat GPT ద్వారా నిత్యం ఎంతో మంది కంటెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుటు Chat GPT ద్వారా డబ్బును కూడా సంపాదించే అవకాశం ఉంది.
చాట్ GPT అనేది AI-ఆధారిత ప్లాట్ ఫారమ్. Google సెర్చింజన్ కు పోటీగా దీనిని రూపొందించారు. ఇప్పుడు మరింతగా అభివృద్ధి చెందింది. ప్రజలు ముఖ్యమైన పనుల కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే, దానిని కేవలం కంటెంట్ కోసం మాత్రమే కాకుండా, డబ్బును కూడా సంపాదించే అవకాశం ఉంది. Chat GPTని ఉపయోగించి పెయిడ్ కంటెంట్ ను రూపొందించుకునే అవకాశం ఉంది. పలు రకాల ఉత్పత్తులు, బ్రాండ్‌లు, వెబ్‌సైట్‌ల కోసం చక్కగా రూపొందించిన కంటెంట్ కోసం డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. అందుకే, ఆకర్షణీయమైన కంటెంట్‌ని సృష్టించడానికి చాట్ GPTని ఉపయోగించుకోవచ్చు. నిర్దిష్ట అంశాల గురించి చాట్ బాట్‌ను అభ్యర్థించడం ద్వారా, మీరు చక్కటి కంటెంట్‌ను పొందవచ్చు. ఈ కంటెంట్ తో ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అయితే, మీరు ChatGPTని అడిగే మీ రిక్వెస్టులు, ప్రశ్నలను ఎంత బాగా ఫ్రేమ్ చేయగలిగితే అంత మంచి కంటెంట్ ను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కంటెంట్ ఎడిటింగ్ సేవలను అందించడానికి చాట్ GPT అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. కథనాలు, బ్లాగ్ పోస్ట్ లతో పాటు ఏదైనా ఇతర రాతపూర్వక కంటెంట్ ను చక్కగా ఎడిట్ చేసి అందిస్తుంది. చాట్ GPT సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా, క్లయింట్‌లకు చక్కటి కంటెంట్ ను అందించే అవకాశం ఉంటుంది.
Chat GPT ద్వారా సంపాదించడానికి మరొక పద్ధతి అనుబంధ మార్కెటింగ్. దీని ద్వారా మీరు మీ కంటెంట్, ఉత్పత్తులు, సేవలు, బ్రాండ్‌లను ప్రచారం చేసుకోవచ్చు. చక్కటి సిఫార్సుల నుంచి కమిషన్ కూడా తీసుకోవచ్చు. Chat GPTని ఉపయోగించుకుని స్టోరీలు, ఆడియో, వీడియోల ద్వారా మీరు వీక్షకుల సంఖ్యను పెంచుకోవచ్చు. చాట్ GPT ద్వారా వీడియోలకు థంబ్ నెయిల్స్ తో పాటు YouTube వీడియోల టైటిల్ సూచనలు కూడా పొందే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీ వీడియోలు, ఆడియోలు, ఆర్టికల్స్ కు మంచి మార్కెటింగ్ సంపాదించే అవకాశం ఉంటుంది.
మొత్తంగా Chat GPT ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎన్నో రకాలుగా Chat GPTని ఉపయోగించి ఇంటి దగ్గరే ఉండి డబ్బును సంపాదించుకోవచ్చు. ఎవరితో సంబంధం లేకుండా కూడా సొంతంగా ఆర్టికల్స్, వీడియోలు, ఆడియోల ద్వారా డబ్బును వెనుకేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం Chat GPT ప్రపంచాన్ని మాత్రమే కాదు, నిరుద్యోగులకు కూడా ఆదాయ వనరుగా మారిందని చెప్పుకోవచ్చు.
Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
iPhone 12 Flipkart Offer: ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ రేట్‌కే యాపిల్ ఐఫోన్ - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!
Whatsapp: వాట్సాప్‌లో ఎక్కువ అవుతున్న మోసాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే డేటా సేఫ్!
Upcoming Mobiles: ఒకే రోజున ఐదు ఫోన్లు లాంచ్ - అక్టోబర్ 4న మొబైల్స్ పండగ!
Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఈసారి ఏం మార్చారు?
Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!
Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
/body>