By: ABP Desam | Updated at : 16 Jul 2022 07:41 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ప్యానసోనిక్ టఫ్‌బుక్ 40 ల్యాప్‌టాప్ లాంచ్ అయింది.
ప్యానసోనిక్ తన కొత్త రగ్డ్ ల్యాప్‌టాప్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే టఫ్‌బుక్ 40. మిలటరీ గ్రేడ్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్ సామర్థ్యాలతో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది పని చేయనుంది.
ప్యానసోనిక్ టఫ్‌బుక్ 40 ధర
దీని ధరను రూ.3.75 లక్షలుగా నిర్ణయించారు. ప్యానసోనిక్ డిస్ట్రిబ్యూటర్స్, సిస్టం ఇంటిగ్రేటర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌పై ఏమైనా ఆఫర్లు ఉన్నాయో, లేవో తెలియరాలేదు.
ప్యానసోనిక్ టఫ్‌బుక్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 14 అంగుళాల పుల్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇంతకు ముందు ఈ సిరీస్ వచ్చిన ల్యాప్‌టాప్‌ల కంటే తక్కువ బరువుతోనే ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. డిస్‌ప్లే కూడా పెద్దగా ఉంది. మెరుగైన స్క్రీన్ బ్రైట్‌నెస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఐ5, ఐ7 వీ ప్రో ప్రాసెసర్లను ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. ఆప్షనల్ ఏఎండీ డెడికేటెడ్ గ్రాఫిక్స్ లేదా ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ కూడా ఈ ల్యాప్‌టాప్‌తో పొందవచ్చు. దీని గ్రాఫిక్స్ ఎక్కువ మొత్తంలో డేటా, ఇమేజెస్, వీడియో ఫీడ్స్‌ను ప్రాసెస్ చేయగలదు.
ఇందులో రెండు బ్యాటరీలు ఉండనున్నాయి. రెండూ కలిపి ఏకంగా 36 గంటల బ్యాకప్ లభించనుంది. ఒక బ్యాటరీ నుంచి ఇంకో బ్యాటరీకి మారేటప్పుడు కూడా ల్యాప్‌టాప్ పవర్ ఆఫ్ కాకుండా ఉంటుంది. ఐపీ66 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను ఈ ల్యాప్‌టాప్ పొందింది. 1.8 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డా ఏమీ కాదని కంపెనీ అంటోంది.
గతంలో ప్యానసోనిక్ ఎస్1 ట్యాబ్లెట్ టఫ్‌బుక్‌ను రగ్డ్ బిల్ట్‌తో లాంచ్ చేసింది. దీని ధరను రూ.98,000గా నిర్ణయించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఈ ట్యాబ్లెట్ ఒక్కసారి చార్జ్ పెడితే 14 గంటల బ్యాకప్‌ను అందించనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Forbes India: గోదావరిఖని యువకుడి సత్తా, ఫోర్బ్స్ ఇండియాలో చోటు - ఇతను అందరికీ తెలిసిన వ్యక్తే!
Xiaomi Book Pro 2022 Launched: షియోమీ కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్ - ఈ ధరలో బెస్ట్ ఇవే!
Dell G15 5525: వావ్ అనిపించే గేమింగ్ ల్యాప్‌టాప్ - లాంచ్ చేసిన డెల్ - ధర ఎంతంటే?
Infinix InBook X1 Slim Sale: ఇన్ఫీనిక్స్ చవకైన ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం - రూ.30 వేలలోపే సూపర్ ఫీచర్లు!
Apple New Macbook Pre Orders: యాపిల్ కొత్త మ్యాక్‌బుక్ ప్రీ-ఆర్డర్లు రేపట్నుంచే - చిన్నగా, క్యూట్‌గా - ధర ఎంతంటే?
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్