Jio Price Hike: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఈ ప్లాన్ ధర పెంచిన కంపెనీ - ఎంత పెరిగిందంటే?
భారతదేశ నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ జియో తన జియోఫోన్ రూ.749 ప్లాన్ ధరను పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్ రూ.899కు అందుబాటులో ఉంది.
రిలయన్స్ జియో తన జియో ఫోన్ ప్లాన్ ధరను పెంచింది. రూ.749 వార్షిక ప్లాన్ ధరను ఏకంగా రూ.150 పెంచి రూ.899కు చేర్చింది. కాబట్టి ఇప్పటివరకు రూ.749తో రీచార్జ్ చేసుకున్నవారు ఇకపై రూ.899తో రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఒక్క జియో ఫోన్ ప్లాన్ ధరను మాత్రమే జియో పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్ పెరిగిన ధరతోనే కంపెనీ వెబ్ సైట్లో కనిపిస్తుంది.
జియో రూ.749 ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులగా ఉండనుంది. నెలకు 2 జీబీ చొప్పున మొత్తంగా 24 జీబీ హై స్పీడ్ డేటాను అందించనున్నారు. ఈ 2 జీబీ డేటాను ఉపయోగిస్తే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 50 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి.
జియో టీవీ, జియో సినిమా, జియోన్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు ఉచితంగా యాక్సెస్ లభించనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జియో రూ.75 జియోఫోన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో రూ.39, రూ.69 ప్లాన్లను లిస్ట్ నుంచి తీసేసింది.
జియో రూ.75 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత చవకైన జియోఫోన్ రీచార్జ్ ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభించనున్నాయి. రోజుకు 50 ఎస్ఎంఎస్‌లతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియోన్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు ఉచితంగా యాక్సెస్ అందించనున్నారు.
ఈ ప్లాన్ ద్వారా 200 ఎంబీ డేటా కూడా లభించనుంది. లఢఖ్ ప్రాంతంలోని పంగోంగ్ లేక్ వద్ద కూడా జియో ఇటీవలే 4జీ సేవలను ప్రారంభించింది. ఈ విషయాన్ని జియో అధికారికంగా ప్రకటించింది. త్వరలో ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కాబట్టి అప్పుడే జియో సహా మిగతా టెలికాంలు కూడా ధరలను పెంచే అవకాశం ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram