News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది.

FOLLOW US: 
Share:

iQoo Z7 Pro 5G: ఐకూ జెడ్7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఐకూ జెడ్7 సిరీస్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఐకూ జెడ్7, ఐకూ జెడ్7ఎస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఐకూ జెడ్7 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఐకూ జెడ్7 ప్రో 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.24,999గా నిర్ణయించారు.

వీటిపై అదనపు డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా అందించారు. దీని ద్వారా రూ.2,000 అదనపు తగ్గింపు కూడా లభించనుంది. సెప్టెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, అధికారిక ఐకూ వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. బ్లూ లాగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఐకూ జెడ్7 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. రింగ్ తరహా ఎల్ఈడీ లైట్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్ వంటి సెన్సార్లు కూడా అందించారు. ఐపీ52 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ అందించారు. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐకూ జెడ్7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మందం 0.74 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 31 Aug 2023 09:14 PM (IST) Tags: iQOO New Phone iQoo Z7 Pro 5G iQoo Z7 Pro 5G Price in India iQoo Z7 Pro 5G Specifications iQoo Z7 Pro 5G Features

ఇవి కూడా చూడండి

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!

Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?