(Source: ECI/ABP News/ABP Majha)
iPhone 13 Launch: ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 13 లాంచింగ్ డేట్ ఇదే!
ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 14న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లకు సంబంధించిన ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఐఫోన్ 13 సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూసే వారికి త్వరలో తీపి కబురు అందనుంది. ఐఫోన్13 సిరీస్ ఫోన్ల విడుదల గురించి చైనాకు చెందిన టిప్‌స్టర్‌తో పాటు.. ఫ్రంట్ ఫేజ్ టెక్ అనే సంస్థ పలు నివేదికలను అందించాయి. వీటి ప్రకారం చూస్తే.. ఈ సారి ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ అనే నాలుగు మోడల్ ఫోన్లను విడుదల చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 14న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లకు సంబంధించిన ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక సెప్టెంబర్ 24 నుంచి ఐఫోన్ 13 సిరీస్ నాలుగు మోడళ్ల సేల్ స్టార్ట్ అవుతుందని ఫ్రంట్ ఫేజ్ టెక్ తన నివేదికలో వెల్లడించింది. యాపిల్ ఈవెంట్‌కు సరిగా వారం ముందు అంటే సెప్టెంబర్ 7న మీడియా సంస్థలకు ఆహ్వానాలు అందనున్నట్లు పేర్కొంది.
ఇక చైనా టిప్‌స్టర్ ఇటీవల ఐఫోన్ 13 మోడల్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సైతం విడుదల చేసింది. ఐఫోన్ 13 సన్ సెట్ గోల్డ్ రంగుల్లో లభ్యం కానున్నట్లు తెలిపింది. అలాగే ఇందులో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ముందు వైపు నాచ్ కెమెరా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
కోవిడ్‌కు తగ్గట్లు కొత్త ఫీచర్..
కొత్తగా వచ్చే ఐఫోన్ 13 మినీ, ప్రో మాక్స్ మోడల్ ఫోన్లలో ఫ్లూ రిస్ట్రిక్షన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫేస్ ఐడీకి సంబంధించి కొత్త అప్‌డేట్ అందించనుంది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా బయటకు వెళితే మాస్క్ వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మాస్క్ వేసుకున్నప్పుడు ఫేస్ ఐడీ పనిచేయదు. దీని వల్ల ఫోన్ అన్‌లాక్ చేయాలంటే మాస్క్ తీయడం లేదా పాస్ కోడ్ ఎంటర్ చేయడం వంటివి చేయాల్సి వస్తోంది. దీనికి చెక్ పెట్టేలా కొత్త ఫీచర్ తీసుకురానుంది. మనం మాస్క్ పెట్టుకున్నా కూడా ఫేస్ గుర్తించేలా ముందు భాగంలో కెమెరా తీసుకొచ్చారు. కళ్లజోడు ఉన్నవారు మాస్క్ పెట్టుకుంటే అద్దాలకు ఆవిరి లాంటి పొర (మంచు మాదిరి) పట్టేస్తుంది. అలా వచ్చినా కూడా ఫేస్ గుర్తు పట్టే విధంగా ఐడీ రూపొందించినట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 10 Prime: రెడ్‌మీ 10 ప్రైమ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రూ.10 వేలలోపు ధర!
Also Read: Mi TV 5X: ఎంఐ కొత్త టీవీ వచ్చేసింది... బడ్జెట్ రేంజ్‌లో అదిరిపోయే ఫీచర్లు