అన్వేషించండి

Infinix ZERO Flip 5G vs TECNO Phantom V Flip 5G: రూ.50 వేలలో బెస్ట్ ఫ్లిప్ ఫోన్ ఏది? - దేని ఫీచర్లు బాగున్నాయి? ఏది కొనవచ్చు?

Infinix Flip Phone vs TECNO Flip Phone: ప్రస్తుతం మనదేశంలో రూ.50 వేల రేంజ్‌లో రెండు ఫ్లిప్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది బెస్ట్ ఫ్లిప్ ఫోన్? ఇన్‌ఫీనిక్స్, టెక్నో ఫ్లిప్ ఫోన్లలో ఏది బాగుంది?

Infinix ZERO Flip 5G vs TECNO Phantom V Flip 5G Phone Comparison: ఇన్‌ఫీనిక్స్ భారతదేశంలో ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ (Infinix ZERO Flip 5G) పేరుతో తన మొదటి ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ. 50,000 కంటే తక్కువ ధరతోనే లాంచ్ అయింది. ఈ ధరలోనే ఇన్‌ఫీనిక్స్ అతిపెద్ద కవర్ డిస్‌ప్లే, బ్యాటరీని ఫోన్‌లో అందించింది. ఇన్‌ఫీనిక్స్ లాంచ్ చేసిన ఈ ఫ్లిప్ ఫోన్... టెక్నో ఫ్లిప్ ఫోన్ టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీతో (TECNO Phantom V Flip 5G) నేరుగా పోటీ పడనుంది. ఈ రెండు చవకైన ఫ్లిప్ ఫోన్‌లను ఇప్పుడు పోల్చి చూద్దాం.

ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ vs టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ: డిజైన్
ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ రాక్ బ్లాక్, వాలెట్ గార్డెన్ రంగులలో లాంచ్ అయింది. దీని మందం ఓపెన్ చేసినప్పుడు 7.64 మిల్లీమీటర్లుగానూ, మడతపెట్టిన తర్వాత 16.04 మిల్లీమీటర్లుగానూ ఉంది. ఈ ఫోన్ బరువు 195 గ్రాములు. ఇందులో ఐపీ రేటింగ్ ఫీచర్ లేదు. అంటే పొరపాటున నీళ్లు పడినా, దుమ్ము పడినా ఫోన్ పాడయ్యే అవకాశం ఉందన్న మాట.

మీరు మిస్టిక్ డాన్, ఐకానిక్ బ్లాక్ కలర్స్‌లో టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీని కొనుగోలు చేయవచ్చు. ఓపెన్ చేసినప్పుడు దీని మందం 6.95 మిల్లీమీటర్లు కాగా, మడతపెట్టిన తర్వాత 14.95 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ ఫోన్ బరువు 194 గ్రాములుగా ఉంది. ఇందులో కూడా ఐపీ రేటింగ్ ఫీచర్‌ను కంపెనీ అందించలేదు.

ఈ నంబర్లను చూసిన తర్వాత రెండు ఫోన్‌లు దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే టెక్నో ఫ్లిప్ ఫోన్ కాస్త సన్నగా, తేలికగా ఉంటుంది.

ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ vs టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ: డిస్‌ప్లే
ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ ఎల్టీపీవో ప్యానెల్‌తో 6.9 అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని డిస్‌ప్లే 1080 x 2640 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, యూటీజీ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఫోన్ కవర్ డిస్‌ప్లేగా 3.6 అంగుళాల అమోఎల్ఈడీ ప్యానెల్‌ను అందించారు. ఇది 1056 x 1066 పిక్సెల్‌ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లతో లాంచ్ అయింది.

టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ కూడా 6.9 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది ఫుల్ హెచ్‌డీప్లస్ స్క్రీన్ రిజల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో సెక్యూరిటీ లేయర్‌ను అందించలేదు. ఫోన్ కవర్ డిస్‌ప్లే 1.32 అంగుళాల అమోఎల్ఈడీ ప్యానెల్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది.

డిస్‌ప్లే పరంగా ఇన్‌ఫీనిక్స్ ఫ్లిప్ ఫోన్ కాస్త ముందంజలో ఉంది. ఎందుకంటే దాని కవర్‌తో పాటు ఇన్నర్ డిస్‌ప్లేకి కూడా ప్రొటెక్షన్ లేయర్ కూడా అందించారు. టెక్నో ఇన్నర్ డిస్‌ప్లే విషయంలో ఈ సెక్యూరిటీ లేయర్ కనిపించదు. అంతే కాకుండా ఇన్‌ఫీనిక్స్ కవర్ డిస్‌ప్లే పరిమాణం కూడా పెద్దది.

ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ vs టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ: ప్రాసెసర్
ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ప్రాసెసర్‌కు 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8 జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది.

మరోవైపు టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ 5జీ కొంచెం శక్తివంతమైన 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన 8 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్‌ను కలిగి ఉంది. కానీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ లేదు. స్టోరేజ్ కూడా తక్కువ. ఇది 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.

ఈ రెండు ఫోన్ల ప్రాసెసర్‌లలో పెద్దగా తేడా లేదు. అయితే ఇన్‌ఫీనిక్స్ 512 జీబీ నిల్వను కలిగి ఉంది. ఇది టెక్నోతో పోలిస్తే రెట్టింపు అని చెప్పవచ్చు.

ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ vs టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ: కెమెరా
ఇన్‌ఫీనిక్స్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది PDAF ఫీచర్‌తో వస్తుంది.

టెక్నో ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. దీని ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్ కాగా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ అందించారు. ఇది కాకుండా ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.

ఈ సందర్భంలో కూడా ఇన్‌ఫీనిక్స్ ఫోన్ 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ PDAF సెల్ఫీ కెమెరాతో ముందుంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ vs టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ: బ్యాటరీ, ఛార్జింగ్
ఇన్‌ఫీనిక్స్ ఫోన్‌లో 4,720mAh బ్యాటరీ ఉంది. ఇది 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. టెక్నో ఫ్లిప్ ఫోన్ 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఈ సందర్భంలో కూడా ఇన్‌ఫీనిక్స్ ఫ్లిప్ ఫోన్... టెక్నో ఫ్లిప్ ఫోన్ కంటే చాలా ముందుందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు పెద్ద బ్యాటరీని కలిగి ఉంది.

ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ vs టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ: ధర ఎంత?
ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ ధర రూ. 49,999గా ఉంది. దీనిలో వినియోగదారులు 8 జీబీ RAM, 512 జీబీ స్టోరేజ్‌ను పొందుతారు.

టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ లాంచ్ ధర కూడా రూ. 49,999గానే ఉంది. అయితే ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్‌ను మాత్రమే కలిగి ఉంది.

అయితే ప్రస్తుతం, లాంచ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని వినియోగదారులు ఇన్‌ఫీనిక్స్ ఫోన్‌ను కేవలం రూ. 44,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే టెక్నో ఫ్లిప్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 52,999కి అందుబాటులో ఉంది. కానీ దీనిపై రూ.25,000 కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో దీని ధర రూ.30 వేలలోపునకు తగ్గనుంది

ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ vs టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ: ఏది బెస్ట్?
ఈ రెండు ఫోన్‌లను పోల్చిన తర్వాత ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫ్లిప్ ఫోన్ చాలా అంశాలలో టెక్నో ఫ్లిప్ ఫోన్ కంటే మెరుగైనదని చెప్పవచ్చు. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ 5జీ... టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ కంటే దాదాపు రూ. 17,000 ఎక్కువ ధరలో ఉంది. తక్కువ ధరలో జస్ట్ ఫ్లిప్ ఫోన్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే టెక్నో ఫోన్ తీసుకోవచ్చు. కాస్త ధర ఎక్కువైనా అన్నిట్లో బెస్ట్ కావాలనుకుంటే ఇన్‌ఫీనిక్స్ మొబైల్ తీసుకోవచ్చు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget