Infinix Zero 5G: రూ.20 వేలలోపు బెస్ట్ ఫోన్.. వాలంటైన్స్ డే రోజు ఎంట్రీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ ఇన్‌ఫీనిక్స్ జీరో 5జీని మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది.
ఇన్‌ఫీనిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్ ఇన్‌ఫీనిక్స్ జీరో 5జీ మనదేశంలో ఫిబ్రవరి 14వ తేదీన లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ లాంచ్ చేయనున్నట మొదటి 5జీ ఫోన్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మొత్తంగా 13 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేయనుంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో 5జీ స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో 5జీ ధర (అంచనా)
కంపెనీ సీఈవో అనీష్ కుమార్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపిన దాని ప్రకారం.. ఈ ఫోన్ ధర రూ.20 వేలలోపే ఉండనుంది. అయితే కచ్చితంగా ఎంత ఉండనుందన్న సంగతి తెలియరాలేదు. ఇప్పటివరకు లీకైన ఈ ఫోన్ ఫీచర్లు చూసుకుంటే రూ.20 వేల రేంజ్‌లో బెస్ట్ ఫోన్ ఇదే కానుంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుందని వార్తలు వస్తున్నాయి. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2460 పిక్సెల్స్‌గానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫొటో స్నాపర్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా.. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్సఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
View this post on Instagram