Infinix Smart 8 Pro: ఇన్‌ఫీనిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ - రూ.10 వేలలోపే 8 జీబీ ర్యామ్?
Infinix Smart 8 Pro Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్రో.
Infinix New Phone: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్రో రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టం ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ధర (Infinix Smart 8 Pro Price in India)
కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ 4 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుందని తెలిపారు. గెలాక్సీ వైట్, రెయిన్ బో బ్లూ, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర త్వరలో వెల్లడించనున్నారు. రూ.10 వేలలోపే దీని ధరను నిర్ణయించే అవకాశం ఉంది.
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Infinix Smart 8 Pro Specifications, Features)
ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.66 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ జీ36 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్రో రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్ అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, మరో ఏఐ లెన్స్ ఉంది. ఇది డెప్త్ ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగపడనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ అందించనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే... 4జీ ఎల్టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా అందించనున్నారు. గైరోస్కోప్, ఈ-కంపాస్, యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి.
బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 189 గ్రాములుగా ఉంది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!