Indian Smartphone Market: ఆండ్రాయిడ్ ఫోన్లకు షాకిస్తున్న యాపిల్ - ఒక్క శాతం తేడాతో ఆ రికార్డు మిస్!
Indian Smartphone Sales: 2024 మూడో త్రైమాసికంలో సేల్స్ పరంగా భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ టాప్‌లో ఉంది. యాపిల్ కేవలం ఒక్క శాతం తేడాతో శాంసంగ్ తర్వాతి స్థానంలో నిలిచింది.
Counterpoint Report: ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (జులై నుంచి సెప్టెంబర్ మధ్య) భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మూడో శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ టైమ్‌లో శాంసంగ్ 23 శాతం వాటాతో మార్కెట్‌ను నడిపించగా, యాపిల్ 22 శాతం వాటాతో గట్టి పోటీని ఇచ్చింది. కేవలం ఒక్క శాతం తేడాతో టాప్ స్పాట్‌ను మిస్ చేసుకుంది. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ధర తక్కువగా ఉండే ఫోన్ల సేల్స్ బాగుంటాయనుకునే వారికి ఇది కొత్త షాక్ అని చెప్పవచ్చు. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ ట్రాకర్ కౌంటర్‌పాయింట్ తాజా పరిశోధన ప్రకారం భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విలువ 12 శాతం (గత సంవత్సరంతో పోలిస్తే) పెరిగి త్రైమాసికంలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. 5జీ స్మార్ట్‌ఫోన్ల వాటా మొత్తం షిప్‌మెంట్‌ల్లో 81 శాతానికి చేరుకుంది.
పెరుగుతున్న కాస్ట్లీ ఫోన్ల సేల్స్
కౌంటర్‌పాయింట్‌లోని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రాచీర్ సింగ్ మాట్లాడుతూ "ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫర్లు, ట్రేడ్ ఇన్ సపోర్ట్‌తో నడిచే ప్రీమియమైజేషన్ ట్రెండ్‌ల కారణంగా మార్కెట్ వేగంగా విలువ వృద్ధి వైపు మళ్లుతోంది. శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్ సిరీస్‌కు ప్రాధాన్యతనిచ్చి దాని విలువ ఆధారితంగా విస్తరించింది. పోర్ట్‌ఫోలియో, ఎక్కువ రేట్ ఉన్న మొబైల్ ఫోన్లకు అప్‌గ్రేడ్ చేయడానికి వినియోగదారులను ప్రోత్సహించడానికి శాంసంగ్ తన మిడ్ రేంజ్, చవకైన ప్రీమియం మోడల్‌లలో గెలాక్సీ ఏఐ ఫీచర్లను కూడా సమీకృతం చేస్తోంది.
మరోవైపు యాపిల్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ చిన్న పట్టణాల్లో విస్తరించడం ప్రారంభించింది. యాపిల్ కొత్త ఐఫోన్‌లపై దృష్టి సారించడం ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రాచీర్ సింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ, "పండగ సీజన్‌కు ముందు ఐఫోన్ 15, ఐఫోన్ 16 సేల్స్ యాపిల్ పనితీరును మరింత పెంచాయి. వినియోగదారులు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో పెట్టుబడి పెడుతున్నారు. ప్రీమియం కొనుగోలుదారులకు యాపిల్‌ను మొదటి ఆప్షన్‌గా మార్చారు." అన్నారు.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
నథింగ్ బ్రాండ్ వరుసగా మూడో త్రైమాసికంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా మిగిలిపోయింది. 2024 మూడో త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఏకంగా 510 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొదటి సారి టాప్-10లోకి ప్రవేశించింది. నివేదిక ప్రకారం పోర్ట్‌ఫోలియో విస్తరణ, వ్యూహాత్మక మార్కెట్ ఎంట్రీ, 45 నగరాల్లో 800కి పైగా మల్టీ-బ్రాండ్ అవుట్‌లెట్‌లతో భాగస్వామ్యాల ద్వారా నథింగ్ ఈ గ్రోత్ సాధించిందని చెప్పవచ్చు.
రియల్‌మీ తన పోర్ట్‌ఫోలియోలో ఈ సంవత్సరం జీటీ సిరీస్‌ని మళ్లీ తిరిగి తీసుకురావడంతో 2024 మూడో త్రైమాసికంలో ప్రీమియం ప్రైస్ బ్యాండ్ (రూ.30,000 మరియు అంతకంటే ఎక్కువ) సహకారంతో ఆరు శాతానికి పెరిగింది.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
This #BhaiDooj, make your sibling smile even brighter with #CircleToSearch, now available on #GalaxyA55 & #GalaxyA35 5G. Just circle any fab outfit or accessory you find online to get Google Search results, and make this festive season more awesome. pic.twitter.com/K7wosjIlI9
— Samsung India (@SamsungIndia) November 1, 2024