Smartphone Tips: స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? - అయితే ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి!
Smartphone Tricks: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయితే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దాన్ని వేగంగా పని చేసేలా చేసుకోవచ్చు.
Smartphone Cache: స్మార్ట్‌ఫోన్ స్లో కావడానికి చాలా కారణాలున్నాయి, ఫోన్‌లో తక్కువ మెమరీ, తక్కువ స్టోరేజ్ లేదా అవసరమైన దానికంటే ఎక్కువ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటివి ఉన్నాయి. ఈ కారణాలన్నీ కాకుండా కాష్ (cache) కారణంగా కూడా స్మార్ట్‌ఫోన్ స్లో అవుతుంది. ఫోన్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు లేదా ఇంటర్నెట్‌లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ కాష్ జనరేట్ అవుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ సూపర్‌ఫాస్ట్‌గా పని చేయాలనుకుంటే, అందులో యాప్స్‌కు సంబంధించిన కాష్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి.
స్మార్ట్‌ఫోన్ కాష్‌ను ఎందుకు క్లియర్ చేయాలి?
కాష్‌ను క్లియర్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ ప్రాసెసింగ్ స్మూత్‌గా ఉంటుంది. అయితే ఇది కాకుండా దీనికి చాలా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీ ఫోన్ ర్యామ్ 4 లేదా 6 జీబీగా ఉండి, మీరు కాష్‌ను క్లియర్ చేయకపోతే, ర్యామ్ ప్రాసెసింగ్ నెమ్మదిగా మారుతుంది. దీని కారణంగా స్మార్ట్‌ఫోన్ కూడా నెమ్మదిగా నడుస్తుంది. కాబట్టి ఫోన్‌లోని కాష్‌ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. మీరు యాప్స్ నుంచి కాష్‌ను క్లియర్ చేయకపోతే, అవి చాలా నెమ్మదిగా పని చేస్తాయి లేదా ఓపెన్ చేసిన వెంటనే క్రాష్ అవుతాయి. మీరు ఎప్పటికప్పుడు ఈ కాష్‌లను క్లియర్ చేస్తూ ఉంటే, మీకు ఎలాంటి సమస్య ఉండదు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో కాష్‌ని క్లియర్ చేయడం ఎలా?
మీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, సాఫ్ట్‌వేర్ వెర్షన్ ఆధారంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో కాష్‌ను క్లియర్ చేసే దశలు మారవచ్చు. అయితే వీటికి స్టాండర్డ్ ప్రాసెస్‌లు కొన్ని ఉన్నాయి. ఈ పద్ధతులు ఫాలో అయితే కాష్‌ని సులభంగా క్లియర్ చేయవచ్చు. ముందుంగా మీ ఫోన్‌లో సెట్టింగ్స్ యాప్‌ని ఓపెన్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ యాప్స్‌పై క్లిక్ చేయండి. అందులో మీరు ఏ యాప్ కాష్ క్లియర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోండి. అందులో స్టోరేజ్‌పై క్లిక్ చేయండి. అక్కడ కాష్ క్లియర్ చేయవచ్చు.
అంతేకాకుండా మీరు అన్ని యాప్స్ కాష్‌ను కూడా ఒకేసారి క్లియర్ చేయవచ్చు. దీన్ని చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. మీ ఫోన్‌లో సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
2. కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ స్టోరేజ్‌పై క్లిక్ చేయండి.
3. కాష్డ్ డేటాపై క్లిక్ చేయండి.
4. అందులో ‘ఓకే’ ఆప్షన్ ఎంచుకోండి. అంతే మీ యాప్ కాష్ డేటా క్లియర్ అవుతుంది.
మీ ఫోన్ ఎక్కువ కాలం స్లో అవ్వకుండా ఉండాలంటే కొనేటప్పుడే వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ బడ్జెట్‌లో అత్యుత్తమ ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఎంచుకోండి. ర్యామ్ కూడా ముఖ్యమే అయినా... ఫోన్ పనితీరు ప్రాసెసర్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీలైనంత టాప్ ఎండ్ ప్రాసెసర్‌ను ఎంచుకోండి. అప్పుడు ఫోన్ ఎక్కువ కాలం స్లో అవ్వకుండా, ల్యాగ్ అవ్వకుండా పని చేస్తుంది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!