అన్వేషించండి

GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!

గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది.

గోప్రో హీరో 12 బ్లాక్ మనదేశంలో లాంచ్ అయింది. దీనికి ముందు వెర్షన్‌తో కంపేర్ చేస్తే చాలా మార్పులు చేసింది. ఈ కొత్త యాక్షన్ కెమెరాలో కంపెనీ జీపీ2 ప్రాసెసర్‌ను అందించింది. అలాగే ముందు వెర్షన్ తరహాలోనే పెద్ద 8:7 సెన్సార్‌ను ఇందులో చూడవచ్చు. మరోవైపు కొత్త ఫీచర్లు కూడా గో ప్రో హీరో 12 బ్లాక్‌లో అందుబాటులోకి రానున్నాయి. బాక్స్‌‌లో ఎండ్యురో బ్యాటరీని కూడా అందించారు. దీని ద్వారా ప్రస్తుతం లాంచ్ అయిన మోడల్ రెట్టింపు బ్యాటరీ బ్యాకప్ అందించనుంది.

గోప్రో హీరో 12 బ్లాక్ ధర
ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.45,000గా నిర్ణయించారు. దీంతోపాటు క్రియేటర్స్ ఎడిషన్ కూడా మార్కెట్లోకి వచ్చింది. దీన్ని కొనాలనుకుంటే రూ.65,000 ఖర్చు పెట్టాల్సిందే. క్రియేటర్ ఎడిషన్‌లో మీడియా మోడ్, లైట్ మోడ్, వోల్టా గ్రిప్ కూడా రానున్నాయి. ఇక ఇందులో కేవలం బ్లాక్ కలర్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది.

దీనికి సంబంధించిన సేల్ ప్రముఖ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం గో ప్రో హీరో 11 బ్లాక్ ధరను మనదేశంలో తగ్గించారు. ఇది రూ.40,999కే అందుబాటులో ఉంది.

గోప్రో హీరో 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
గోప్రో హీరో 12 చూడటానికి ముందు వెర్షన్ తరహాలోనే ఉంది. కానీ కొన్ని మార్పులు చేశారు. 5.3కే, 4కే రిజల్యూషన్‌లో షూట్ చేసిన వీడియోలకు హెచ్‌డీఆర్ సపోర్ట్‌ను కంపెనీ తీసుకువచ్చింది. ఇందులో కొత్త వర్టికల్ క్యాప్చర్ మోడ్ కూడా తీసుకువచ్చింది. దీంతో 9:16 యాస్పెక్ట్ రేషియోలో వీడియోలు రికార్డు చేయవచ్చు. టైమ్‌రాప్, టైమ్‌ల్యాప్స్, నైట్ ఎఫెక్ట్స్, నైట్ ల్యాప్స్ వంటి ఫీచర్లు కూడా 8:7 మోడ్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆటోబూస్ట్ ఉన్న హైపర్‌స్మూత్ 6.0 ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా మరింత స్టెబిలైజేషన్ లభించనుంది. అలాగే నాలుగు రెట్లు ఎక్కువ డేటాను అందించనుందని కంపెనీ తెలిపింది. ఒకవేళ మీరు గోప్రోలో ఫొటోలు దిగాలనుకుంటే ఇంటర్వల్ ఫొటో అనే ఫీచర్ కూడా అందించారు. దీని ద్వారా 0.5 సెకన్ల నుంచి 120 సెకన్ల వరకు టైమర్‌తో ఫొటోలు తీసుకోవచ్చు.

దీంతోపాటు వైర్‌లెస్ ఆడియో రికార్డింగ్ ఫీచర్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువస్తుంది. వినియోగదారులు తమ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకుని ఆడియో రికార్డు చేసుకోవచ్చు. దీంతోపాటు వాయిస్ కమాండ్లను కూడా వైర్‌లెస్‌గా వినవచ్చు. గోప్రో హీరో 12 బ్లాక్‌కు ఒకేసారి నాలుగు బ్లూటూత్ డివైస్‌లు కనెక్ట్ చేయవచ్చు.

ఈ కొత్త గోప్రో హీరో 12 బ్లాక్‌లో జీపీ2 ప్రాసెసర్‌ను అందించారు. 8:7 యాస్పెక్ట్ రేషియో ఉన్న 1/1.9 అంగుళాల సెన్సార్ కూడా ఉంది. ఈ కెమెరాకు 2.27 అంగుళాల టచ్ డిస్‌ప్లేను అటాచ్ చేశారు. అలాగే వెనకవైపు టచ్ ఫీచర్ లేని 1.4 అంగుళాల ఫీచర్ ఉంది. కేస్ లేకుండానే 10 మీటర్లు లేదా 33 అడుగుల లోతు వరకు వాటర్ ప్రూఫ్ రేటింగ్‌ను ఈ డివైస్ పొందింది. ఈ యాక్షన్ కెమెరాలో 1720 ఎంఏహెచ్ ఎండ్యురో బ్యాటరీని అందించారు. ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే రెండు రెట్లు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget