(Source: ECI/ABP News/ABP Majha)
Google Chrome: ఈ ఫోన్లు ఉపయోగిస్తున్నారా? - అయితే ఇక క్రోమ్ పని చేయదు!
Google Chrome Stopped Working: గూగుల్ క్రోమ్, గూగుల్ క్యాలెండర్ ఇకపై ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 లేదా దానికి ముందు వెర్షన్ డివైస్‌ల్లో పని చేయబోదు.
Google Updates: బ్రౌజింగ్ కోసం మనమందరం ఎక్కువగా మన స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తాం. మీరు కూడా ఈ బ్రౌజర్‌ని ఉపయోగిస్తుంటే మీ కోసం ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. వాస్తవానికి ఆండ్రాయిడ్ నౌగట్ 7.1లో గూగుల్ క్యాలెండర్, క్రోమ్‌కు కంపెనీ సపోర్ట్‌ను నిలిపివేయనుంది. ఎందుకంటే పాత వెర్షన్లకు సపోర్ట్ అందించడం చాలా సమయం తీసుకుంటుంది. ఖర్చు పరంగా కూడా ఖరీదైనది. మీరు ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 వెర్షన్ ఉన్న లేదా దాని కింద వెర్షన్‌తో పని చేసే ఏదైనా ఫోన్‌ని ఉపయోగిస్తుంటే గూగుల్ క్రోమ్ కొత్త అప్‌డేట్ మీ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉండదు. అటువంటి వినియోగదారుల కోసం క్రోమ్ వీ119 తుది వెర్షన్ అవుతుంది.
గూగుల్ క్యాలెండర్ కోసం యాప్ తాజా వెర్షన్‌లో గూగుల్ కొత్త "UnsupportedOperatingSystem__enabled" ఫ్లాగ్‌ను జోడించిందని అధికారిక బ్లాగ్‌పోస్ట్ పేర్కొందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. ఈ యాప్‌ను ఓపెన్ చేస్తే వినియోగదారులను ఆండ్రాయిడ్ ఓరియో 8.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయమని కోరుతూ పాప్ అప్ మెసేజ్‌ను చూపిస్తుంది. ప్రస్తుతం గూగుల్ క్యాలెండర్‌కు కంపెనీ సపోర్ట్ ఎప్పుడు నిలిపివేస్తుందో తెలియరాలేదు.
కేవలం మూడు శాతం మాత్రమే...
ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్ తన ఆండ్రాయిడ్ వెర్షన్ పంపిణీ వివరాలను ఆండ్రాయిడ్ స్టూడియోలో అప్‌డేట్ చేసింది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో దాదాపు మూడు శాతం రన్ అవుతుందని వెల్లడి అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కంపెనీ ఈ ఓఎస్ వెర్షన్ నుంచి యాప్ సపోర్ట్‌ను నిలిపివేస్తోంది. తక్కువ వినియోగదారుల కారణంగా సపోర్ట్ అందించడానికి కంపెనీ ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి ఏ మాత్రం ప్రయోజనకరం కాదు.
కాబట్టి మీరు పాత వెర్షన్‌లో యాప్‌ని ఉపయోగించడం కొనసాగిస్తే మీకే ప్రమాదం. ఎందుకంటే ఏ యాప్‌ను అయినా ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం యాప్‌లు రూపొందిస్తారు. కాబట్టి హ్యాకర్లు మీ డివైస్‌ను సులభంగా యాక్సెస్ చేయగలరు. వీటికి కనీసం సెక్యూరిటీ సపోర్ట్ కూడా లభించదు.
మరోవైపు వాట్సాప్ సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానుందని తెలుస్తోంది. వాట్సాప్ కొంతకాలం క్రితం ఛాట్ లాక్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ వ్యక్తిగత ఛాట్లను ఫోల్డర్‌లో లాక్ చేయవచ్చు. లాక్ చేసిన తర్వాత మీ ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే వాటిని యాక్సెస్ చేయగలం. అయితే ఈ ఫీచర్‌తో ఉన్న సమస్య ఏంటంటే మీ మొబైల్‌కి స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల ఫింగర్ ప్రింట్ లాక్‌ని యాడ్ చేసినట్లయితే వారు మీ వాట్సాప్ సీక్రెట్ ఛాట్లను కూడా యాక్సెస్ చేయగలరు. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు వాట్సాప్ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. దాని సహాయంతో మీ లాక్ చేసిన ఛాట్ల కోసం ఫింగర్ ప్రింట్ కాకుండా మరొక టెక్స్ట్ పాస్‌వర్డ్‌ను కూడా సెట్ చేయవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!