ComfoBuds Mini: ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇయర్‌బడ్స్ - అదిరిపోయే ఫీచర్లు కూడా - ఎలా ఉన్నాయో చూసేయండి!
ప్రపంచంలోనే అత్యంత చిన్న వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి.

ప్రస్తుతం కొత్త ఇయర్ ఫోన్స్ కొనాలనుకునేవారు ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ను కూడా ఒక ఆప్షన్‌గా చూస్తున్నారు. వీటి బరువు తక్కువగా ఉండటం, క్యారీ చేయడం సులభంగా ఉండటంతో యువత వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత చిన్న ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. అవే కాంఫోబడ్స్ మినీ. ప్రపంచంలో అత్యంత చిన్న ఇయర్ బడ్స్ కావడంతో పాటు వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ) ఫీచర్లు కూడా ఉన్నాయి.
కాంఫోబడ్స్ మినీ ధర
అమెరికాలో వీటి ధరను 100 డాలర్లుగా (సుమారు రూ.7,600) నిర్ణయించారు. ఏప్రిల్ 15వ తేదీలోపు వీటిని కొనుగోలు చేస్తే 15 డాలర్ల తగ్గింపు లభించనుంది. అయితే ఇవి మనదేశంతో పాటు మిగతా దేశాల్లో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
కాంఫోబడ్స్ మినీ స్పెసిఫికేషన్లు
వీటి బరువు కేవలం 3.7 గ్రాములుగానే ఉంది. ఇందులో నాలుగు సాఫ్ట్ సిలికోన్ ఇయర్ టిప్ ఆప్షన్లను బాక్స్‌లో అందించారు. కాంఫోబడ్స్ మినీలో ప్రొప్రెయిటరీ క్వైట్ మ్యాక్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. 40 డెసిబెల్స్ వరకు నాయిస్‌ను ఇవి క్యాన్సిల్ చేయగలవు. ఇందులో వేర్వేరు ఏఎన్‌సీ మోడ్స్ కూడా ఉన్నాయి.
ఒక్కో ఇయర్‌బడ్‌లో రెండు మైక్రోఫోన్లు అందించారు. ఇవి కాల్స్ మాట్లాడే సమయంలో వాయిస్ బాగా వినపడేలా సహాయపడతాయి. ఈ ఇయర్‌బడ్స్ శక్తివంతమైన, బ్యాలన్స్‌డ్ సౌండ్‌ను అందించనుంది. వీటిలో 7 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు ఉండనున్నాయి.
క్యూఐ కంపాటిబుల్ వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా వీటిలో ఉన్నాయి. ఏఎన్‌సీ ఆన్ చేస్తే ఐదు గంటల పాటు, ఆఫ్ చేస్తే ఆరు గంటల పాటు ఇవి పనిచేయనున్నాయి.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
View this post on Instagram





















