Realme Pad X India Launch: త్వరలో మన మార్కెట్లోకి రియల్‌మీ చవకైన ట్యాబ్ - రూ.15 వేలలోపే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ బడ్జెట్ ల్యాప్‌టాప్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే సరిగ్గా ఎప్పుడు లాంచ్ కానుందనే విషయం మాత్రం తెలియరాలేదు. దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా కంపెనీ వెబ్ సైట్‌లో చూడవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ట్యాబ్లెట్ సేల్‌కు రానుంది. ఈ ట్యాబ్లెట్ చైనాలో గత నెలలోనే లాంచ్ అయింది.
రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ధర (చైనా వేరియంట్)
చైనాలో ఈ ట్యాబ్లెట్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 యువాన్లుగా (సుమారు రూ.15,000) ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా (సుమారు రూ.18,400) నిర్ణయించారు. బ్రైట్ గ్రీన్ చెస్ బోర్డ్, సీ సాల్ట్ బ్లూ, స్టార్ గ్రే రంగుల్లో ఈ ట్యాబ్లెట్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ స్పెసిఫికేషన్లు (చైనా వేరియంట్)
ఇందులో 11 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు.
128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్మార్ట్ కీబోర్డు, రియల్‌మీ మ్యాగ్నటిక్ స్టైలస్‌ను అందించారు. నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 8340 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram