By: ABP Desam | Updated at : 09 Jul 2022 06:29 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
హెచ్‌టీసీ ఏ101 ట్యాబ్లెట్ లాంచ్ అయింది.
హెచ్‌టీసీ తన కొత్త డివైస్ ఏ101 ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్ ప్రస్తుతానికి రష్యా, దక్షిణాఫ్రికాలో లాంచ్ అయింది. ఇందులో 10 అంగుళాల డిస్‌ప్లే, యూనిసోక్ చిప్‌సెట్, వెనకవైపు రెండు కెమెరాలు, పెద్ద బ్యాటరీ కూడా ఉన్నాయి.
హెచ్‌టీసీ ఏ101 ట్యాబ్లెట్ ధర
దీని ధరను 19,890 రూబుల్స్‌గా (సుమారు రూ.28,400) ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ మాత్రమే ఇందులో అందించారు. గ్రే, సిల్వర్ రంగుల్లో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు. ఇది మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
హెచ్‌టీసీ ఏ101 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 10 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1920 x 1200 పిక్సెల్స్‌గా ఉంది. మెటల్ బాడీతో ఈ డివైస్‌ను రూపొందించారు. యూనిసోక్ టీ618 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను పెంచుకోవడానికి మైక్రో ఎస్‌డీ కార్డు అందించారు.
ఈ ట్యాబ్లెట్‌తో పోగో పిన్స్ కూడా అందించారు. అంటే ఆప్షన్ల్ కీబోర్డు కనెక్ట్ చేసుకోవచ్చన్న మాట. ఇక వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
వైఫై, బ్లూటూత్ వీ5.0, ఎల్టీఈ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్ కూడా ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..
Common Charging Port: మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
Moto Tab G62: మోటొరోలా కొత్త ట్యాబ్ వచ్చేసింది - తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లే!
Google Warning: ‘గూగుల్’ ఉద్యోగుల్లో గుబులు - ఆ వార్నింగ్‌తో వణికిపోతున్న సిబ్బంది
pTron Tangent Duo: రూ.500లోపే వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం