By: ABP Desam | Updated at : 23 Jun 2022 04:52 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
యాంబ్రేన్ వైజ్ రోమ్ స్మార్ట్ వాచ్ మనదేశంలో లాంచ్ అయింది.
యాంబ్రేన్ మనదేశంలో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. అదే యాంబ్రేన్ వైజ్ రోమ్ స్మార్ట్ వాచ్. ఇందులో సర్క్యులర్ డయల్, 100కు పైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. దీంతోపాటు బ్లూటూత్ కాలింగ్ ఫంక్షన్ కూడా ఈ వాచ్‌లో అందించారు. డిజో వాచ్ డీ, పీట్రాన్ ఫోర్స్ ఎక్స్10ఈలతో ఈ వాచ్ పోటీ పడనుంది.
యాంబ్రేన్ వైజ్ రోమ్ స్మార్ట్ వాచ్ ధర
ఈ స్మార్ట్ వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని ధరను రూ.1,799గా నిర్ణయించారు. దీనిపై ఒక సంవత్సరం వారంటీని అందించారు. జేడ్ బ్లాక్, స్టోన్ గ్రే, ఫెర్న్ గ్రీన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
యాంబ్రేన్ వైజ్ రోమ్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్లు
ఇందులో 1.28 అంగుళాల సర్క్యులర్ లూసిడ్ డిస్‌ప్లేను అందించారు. 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్‌ను ఇందులో ప్రొటెక్షన్ కోసం అందించారు. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే అందించనుంది. మీ రోజువారీ కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి ఇందులో థియేటర్ మోడ్ అనే ఫీచర్‌ను అందించారు. దీన్ని యాక్టివేట్ చేస్తే బ్రైట్‌నెస్ తగ్గడంతో పాటు వైబ్రేషన్ లెవల్స్ కూడా తగ్గుతాయి.
ఇందులో 100కు పైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. వినియోగదారులు వాటిలో నుంచి తమకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ఐపీ68 స్టాండర్డ్స్ వరకు స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అంటే పొరపాటున నీరు వాచ్ మీద పడ్డా ఏం కాదన్న మాట.
హార్ట్ రేట్ ట్రాకింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, ఎస్‌పీఓ2 ట్రాకర్, మెన్‌స్ట్రువల్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. దీంతోపాటు వెదర్ ఫోర్‌కాస్ట్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, హై ఏఆర్ అలెర్ట్, బ్రీత్ ట్రైనింగ్ ఫీచర్లు యాంబ్రేన్ వైజ్ రోమ్ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. 60కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను కంపెనీ ఇందులో అందించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లను ఇది సపోర్ట్ చేయనుంది.
రెండు గంటల పాటు చార్జింగ్ పెడితే ఈ వాచ్ ఏకంగా 10 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇవ్వనుంది. 260 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ మైక్ కూడా ఉంది. ఇది బ్లూటూత్ కాలింగ్స్‌ను సపోర్ట్ చేయనుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇన్ కమింగ్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్‌లను మీకు నోటిఫై చేసే స్మార్ట్ నోటిఫికేషన్ ఫీచర్ ఇందులో ఉంది. అలాగే వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Black Friday Sale 2023: భారతదేశ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు - అమెజాన్ నుంచి యాపిల్ వరకు!
Samsung New TWS Earbuds: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఇయర్‌బడ్స్ వచ్చేది ఎప్పుడు - ఫీచర్లు కూడా లీక్!
Apple Airpods Pro: ఎయిర్ పోడ్స్ కొనాలనుకుంటున్నారా? - బ్లాక్ ఫ్రైడే సేల్ వరకు ఆగక్కర్లేదు - ప్రస్తుతం భారీ ఆఫర్!
Importance Of Update: ఫోన్‌కు అప్డేట్ వస్తే వదిలేస్తున్నారా? - అయితే ఇవి తెలుసుకోండి ఫస్టు!
Festival Offer Sale: ఫెస్టివల్ సేల్స్‌లో ట్యాబ్‌పై భారీ ఆఫర్లు - కొత్తది కొనాలంటే ఇదే రైట్ టైం!
తెలంగాణలో రేపే కౌంటింగ్-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం
Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
/body>