![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
![ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్! Elon Musk Confirms Audio and Video Calls Feature Coming To X Previously Known As Twitter ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/a4c8a7273dc591d90e3a76ddf1cff5051693481443354252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ట్విట్టర్‌ను తన చేతిలోకి తీసుకుని ‘ఎక్స్’గా మార్చిన తర్వాత ఎలాన్ మస్క్ దానికి ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకువస్తున్నారు. ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్లను కూడా ఎక్స్‌లో (ట్విట్టర్) తీసుకురానున్నట్లు మస్క్ ప్రకటించారు. దీనికి ఫోన్ నంబర్ కూడా అవసరం లేదని తెలిపారు. దీని ద్వారా ఎక్స్‌ను గ్లోబల్ అడ్రస్ బుక్‌గా మార్చనున్నామని తెలిపారు.
ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎన్నో మార్పులు చేసిన ఎలాన్ మస్క్ కంపెనీ పేరును కూడా మార్చేశాడు. ట్విట్టర్‌ను ‘ఎక్స్’గా మార్చాడు. దీనికి తోడు ట్విట్టర్ లోగోను కూడా మార్చేశారు. యాప్ లోగోను కూడా మార్చేశారు. ‘బ్లూ’ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు తమకు కావాల్సిన యాప్ లోగోను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ‘x.com’ వెబ్‌సైట్‌కి లాగిన్ అయితే అది కూడా ‘Twitter.com’కి రీడైరెక్ట్ అవుతుంది. త్వరలో వెబ్‌సైట్ డొమైన్‌ను కూడా మార్చేసే అవకాశం ఉంది.
ఎలాన్ మస్క్ ‘X’ కొత్త లోగోతో హెడ్ క్వార్టర్స్ ఫొటోను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను షేర్ చేశారు. ‘X’ ఆకారంలో లైటింగ్ ట్విట్టర్ ప్రధాన కార్యాలయం పైన పడుతుంది. ఈ ఫోటోను కంపెనీ సీఈవో లిండా యాకారినో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాన్ మస్క్ తన ప్రొఫైల్ ఫొటోను కూడా మార్చారు. ఎలాన్ మస్క్‌తో పాటు ట్విట్టర్‌కు సంబంధించిన ఇతర అధికారిక హ్యాండిల్స్ ప్రొఫైల్ పిక్ కూడా ఛేంజ్ చేశారు.
ట్విట్టర్ ఉన్నప్పుడు ఇందులో చేసే పోస్టును ట్వీట్ అనే వారు. ఇప్పుడు దాన్ని ‘పోస్టు’గా మార్చారు. రీట్వీట్‌ను రీపోస్ట్‌గానూ, కోటెడ్ ట్వీట్‌ను ‘కోట్స్’గానూ మార్చారు. ట్విట్టర్‌కు పోటీగా మెటా కూడా థ్రెడ్స్ అనే యాప్‌ను గత నెల 6వ తేదీన లాంచ్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ యాప్ ఏకంగా 100 మిలియన్ల యూజర్ మార్కును అందుకోవడం విశేషం.
కానీ కొత్త తరహా ఫీచర్లను ఎప్పటికప్పుడు అందించకపోవడంతో ‘థ్రెడ్స్’ యూజర్స్ ఫ్లో బాగా తగ్గిపోయింది. కానీ ఎలాన్ మస్క్ వ్యవహార శైలి కారణంగా ట్విట్టర్ మీద యూజర్లు కాస్త నెగిటివ్‌గా ఉన్న మాట వాస్తవం. దాన్ని క్యాష్ చేసుకోవడంలో ‘థ్రెడ్స్’ కూడా ఘోరంగా విఫలం అయింది.
Video & audio calls coming to X:
— Elon Musk (@elonmusk) August 31, 2023
- Works on iOS, Android, Mac & PC
- No phone number needed
- X is the effective global address book
That set of factors is unique.
Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)