అన్వేషించండి

Google Chrome కొనుగోలుకు చెన్నై కుర్రాడి సంచలన ఆఫర్! 30 ఏళ్ల CEO సృష్టించిన ప్రకంపనలు!

Perplexity CEO : పెర్‌ఫ్లెక్సిటీకి సీఈవో అయిన అరవింద్‌ శ్రీనివాస్ పేరు గ్లోబల్ టెక్‌ సర్కిల్‌లో మారుమోగుతోంది. గూగుల్‌కు చెందిన క్రోమ్‌ బ్రౌజర్‌ను కొంటామని సుందర్‌పిచాయ్‌ ముందే బేరం పెట్టారు.

Perplexity CEO Aravind Srinivas గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ అమ్మకానికి పెడతారా అంటూ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు పెర్‌ఫ్లెక్సిటీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అరవింద్‌ శ్రీనివాస్ లెటర్ రాశారు. ఇప్పుడు ఇదే వార్త గ్లోబల్‌టెక్ సర్కిల్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. 34.5 బిలియన్ల డాలర్లకు అమ్మకానికి పెడతారా అంటూ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న వాల్యూ ప్రకారం పెర్‌ఫ్లెక్సిటీ కంపెనీ విలువ 14 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంటుంది. అలాంటి కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ అయిన గూగుల్‌కు చెందిన ఓ ప్రోడక్ట్‌ను కొనేందుకు ఆశపడటమే కాదు ఏకంగా ఓపెన్ ఆఫర్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

గూగుల్ క్రోమ్‌కు మూడు బిలియన్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. ఇప్పడు ఇది కేవలం బ్రౌజర్ మాత్రమే కాదు. గూగుల్ ఉత్పత్తిలో కీలకమైంది. గూగుల్‌సెర్చ్‌, యాడ్‌ రెవెన్యూ జనరేషన్‌, క్లౌడ్‌ సేవలకు ఇదే ఎంట్రీ గేట్ లాంటిది. అలాంటి ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు మూడేళ్ల ఎక్స్‌పీరియన్స్‌ కలిగిన కంపెనీ కొనుగోలు చేస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

పెర్‌ఫ్లెక్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసిన అరవింద్‌ శ్రీనివాస్‌ చెన్నైకు చెందిన వ్యక్తి. ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్నారు. తర్వాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివారు. అక్కడ చదువు పూర్తి అయిన తర్వాత యోషువా బెంగియోతో కలిసి పని చేశారు. ఆయనఓ ఏఐ నిపుణుడు. గూగుల్‌లో కూడా పని చేశారు. తనకు ఉన్న అనుభవంతో 2022లో  డెనిస్‌ యారట్స్‌ జానీ హో, ఆండీ కొన్‌విన్స్‌కితో కలిసి పెర్‌ఫ్లెక్సిటీ ఏఐను ప్రారంభించారు. 

పెర్‌ఫ్లెక్సిటీ ఏర్పాటు చేసిన కొన్ని నెలల్లోనే బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో శ్రీనివాస్ పేరు మారుమోగిపోయింది. టెక్‌ రంగంలో ఉన్న హేమాహేమీలతో పోల్చుకుంటే శ్రీనివాస్ ఇంకా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నట్టు లెక్క అలాంటి వ్యక్తి గూగుల్‌ ఉత్పత్తిని కొనేస్తానంటూ ఓపెన్ లెటర్ రాయడం సంచలనంగా మారుతుంది. అది కూడా గూగుల్‌ క్రోమ్ కోర్టు సమస్యల్లో ఉన్నటైంలో. ఈ మధ్య క్రోమ‌కు వ్యతిరేకంగా అమెరికాలోని కోర్టు తీర్పు ఇచ్చింది. గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేసేందుకు క్రోమ్‌ అమ్మాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే తీర్పును గూగుల్ సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. అంతే కానీ క్రోమ్ విక్రయించేందుకు మాత్రం సిద్ఘం లేదు. కానీ ఇంతలో చెన్నైకు చెందిన 30 ఏళ్ల కుర్రాడు చేసిన ప్రతిపాదన మాత్రం టాక్‌ ఆఫ్‌ద ఇండస్ట్రీగా మారింది. 

దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయు. పెర్‌ఫ్లెక్సిటీ అనే టూల్‌ వినియోగదారులను పెంచుకునేందుకు శ్రీనివాస్ వేసిన ఎత్తుగడ అని కొందరు విమర్శిస్తున్నారు. ఇది సాధ్యమయ్యే ప్రతిపాదన కాదని వైరల్ అవ్వడానికో, న్యూస్‌లో నిలవడానికో ఇలా చేసి ఉంటారని విమర్శిస్తున్నారు. 

పెర్‌ఫ్లెక్సిటీ సీఈవో అనుకున్నట్టు గూగుల్ క్రోమ్‌ కొనుగోలు చేయాలంటే మాత్రం అంత ఈజీకాదు. నిధుల సమీకరణ పెర్‌ఫ్లెక్సిటీకి తలకు మించిన భారం అవుతుంది. ఇప్పటికే ఆ కంపెనీ ఏర్పాటుకు ఎన్‌విడియా, సాఫ్ట్‌బ్యాంక్‌ను ఒప్పించి ప్రారంభించింది. అలా చేస్తే ఒక బిలియన్ డాలర్ మాత్రమే సేకరించింది. అలాంటిది ఇప్పుడు గూగుల్ క్రోమ్‌కు ఇచ్చిన ఆఫర్ ప్రకారం 34.5 బిలియన్ డాలర్లు సమకూర్చాలంటే అంత ఈజీకాదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
AI Impact on Relationships: చాట్‌జీపీటీ కారణంగా భారత్‌లో బ్రేకప్‌లు, విడాకులు! రిలేషన్‌షిప్‌పై ఏఐ ఎఫెక్ట్!
చాట్‌జీపీటీ కారణంగా భారత్‌లో బ్రేకప్‌లు, విడాకులు! రిలేషన్‌షిప్‌పై ఏఐ ఎఫెక్ట్!
Google Gemini: ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Embed widget