అన్వేషించండి

Google Gemini: ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!

టెక్ దిగ్గజం గూగుల్‌ తన ఏఐ చాట్‌బాట్‌ జెమినీలో కీలకమన భద్రతా అప్‌డేట్‌లను ప్రకటించింది. వినియోగదారుల మానసిక స్థితిని, ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలను గుర్తించి వెంటనే సైకాలజిస్ట్‌లు సలహా అందేలా చేస్తుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జెమినిలో 'హెల్ప్ ఈజ్ అవైలబుల్' ఫీచర్, మానసిక వేదనకు తక్షణ సహాయం.
  • ఆత్మహత్య ఆలోచనలు తెలిపితే, క్రైసిస్ హాట్‌లైన్‌లకు వన్‌ టాప్‌ సదుపాయం.
  • AI మానవ భావోద్వేగాలను అనుకరించకుండా, సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుంది.
  • సమయానికి సమాచారం, మానవ మద్దతుతో ప్రజలను అనుసంధానించడమే లక్ష్యం.

Google Gemini: నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ మనుషులతో మాట్లాడే విధానం రోజురోజుకూ మారుతోంది. అయితే ఇంట్రాక్షన్ కేవలం సమాచార సేకరణకే పరిమితం కాకుండా, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేవిగా ఉండాలని గూగుల్ భావిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్‌ జెమినీలో సరికొత్త హెల్ప్ ఈజ్ అవైలబుల్  అనే ఫీచర్‌ను రీడీజైన్ చేసి ప్రవేశపెట్టింది. 

ఈ అప్‌డేట్‌ ప్రకారం ఒక వినియోగదారుడు జెమినితో చాట్ చేస్తున్నప్పుడు తన మానసిక వేదనను లేదా ఆత్మహత్య వంటి తీవ్రమైన ఆలోచనలను వ్యక్తం చేస్తే, ఏఐ  సంకేతాలను తక్షణమే పసిగడుతుంది. వెంటనే సంభాషణ మధ్యలో ఒక ప్రత్యేకమైన ఇంటర్‌ఫేస్ ప్రత్యక్షమవుతుంది. ఇది వినియోగదాడికి  క్రైసిస్‌ హాట్‌లైన్‌లను సంప్రదించడానికి, టెక్స్ట్‌ మెసేజ్ పంపడానికి లేదా నేరుగా నిపుణులతో మాట్లాడటానికి వన్‌ టాప్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ సహాయక ఫీచర్ ఆ సంభాషణ ముగిసే వరకు స్క్రీన్‌పైనే కనిపిస్తూ ఉంటుంది. 

గూగుల్ ఈ చర్య తీసుకోవడానికి ప్రధాన కారణం అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో నమోదైన ఒక దావా. ఫ్లోరిడాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ అనే వ్యక్తి 2025లో అక్టోబ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. జెమిని చాట్‌బాట్ అతనితో వారాల తరబడి ఇంట్రాక్షన్ అయ్యింది. అతని ఆత్మహత్యను ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చిత్రీకరించిందని, అతని మరణానికి ఏఐ సహకరించిందని అతని తండ్రి ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. 

ఏఐ వ్యవస్థలు మనుషుల వలే ప్రవర్తించకూడదని, అవి భావోద్వేగాలను అనుకరించిడం వల్ల మానసిక బలహీనత ఉన్న వారు సులభంగా ప్రభావితం అవుతారని, ఈ కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏఐ తన పరిమితులను తెలుసుకొని ప్రవర్తించేలా గూగుల్ మార్పులు చేర్పులు చేసింది. 

ఎప్పుడు ఎలా అమలులోకి వస్తుంది?

గూగుల్ ఈ అప్‌డేట్‌ను ప్రపంచవ్యాప్తంగా దశలవారిగా విడుదల చేస్తోంది. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఇది అందుబాటులోకి రాగా, భారత్‌లో  ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాల్సి ఉంది. జెమిని చాట్‌బాట్‌కు వినియోగదారుల మానసిక స్థితిని అర్థం చేసుకునేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 

వచ్చిన మార్పులు ఏంటీ?

జెమిని ఇకపై మనుషుల వెల భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ప్రదర్శించకుండా, కేవలం ఒక సహాయకారిగా మాత్రమే వ్యవహరించేలా శిక్షణ ఇచ్చారు. ఇతరులను వేధించడం లేదా ఎగతాళి చేసేలా ప్రవర్తించకుండా ఏఐను నియంత్రించారు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు కేవలం సమాధానం ఇవ్వడమే కాకుండా, మానవ సహాయం పొందేలా వనరులను చూపిస్తుంది. 

కృత్రిమ మేధ విస్తరిస్తున్న వేళ టెక్ కంపెనీల భాద్యత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఐ కేవలం కోడింగ్ లేదా సమాచారాన్ని ఇచ్చే యంత్రం మాత్రమే కాదని , అది సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలని  అప్‌డేట్‌ స్పష్టం చేస్తోంది. గతంలో ఏఐ చాట్‌బాట్‌లు వినియోగదారులతో అతిగా చనువు ప్రదర్శించడం వల్ల వారు భ్రమల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. 

గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొన్నట్టుగా, సరైన సమయంలో సరైన సమాచారం, మానవ మద్ధతుతో ప్రజలను అనుసంధానించడమే మా లక్ష్యం. టెక్నాలజీ, మానవ భావోద్వేగాల మధ్య ఉన్న సన్నని గీతను గౌరవిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఏఐ ఒక రక్షణ కవచంగా మారాలని ఈ అప్‌డేట్ ఉద్దేశం.  

Frequently Asked Questions

గూగుల్ జెమినీలో 'హెల్ప్ ఈజ్ అవైలబుల్' ఫీచర్ అంటే ఏమిటి?

జెమినీతో సంభాషణలో తీవ్రమైన మానసిక వేదన లేదా ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేస్తే, ఈ ఫీచర్ క్రైసిస్ హాట్‌లైన్‌లను సంప్రదించడానికి వన్‌ టాప్‌ సదుపాయాన్ని అందిస్తుంది.

ఈ కొత్త ఫీచర్ ఎందుకు ప్రవేశపెట్టబడింది?

జెమినీ చాట్‌బాట్ ఒక వినియోగదారుడి ఆత్మహత్యకు పరోక్షంగా సహకరించిందని ఆరోపిస్తూ వచ్చిన దావా నేపథ్యంలో గూగుల్ ఈ మార్పులు చేసింది.

జెమినీలో వచ్చిన ప్రధాన మార్పులు ఏమిటి?

జెమినీ ఇకపై మానవ భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ప్రదర్శించకుండా, కేవలం సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుంది. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు మానవ సహాయం పొందేలా వనరులను చూపుతుంది.

ఈ అప్‌డేట్‌ ఎప్పుడు, ఎక్కడ అందుబాటులోకి వస్తుంది?

ఈ అప్‌డేట్‌ను గూగుల్ ప్రపంచవ్యాప్తంగా దశలవారిగా విడుదల చేస్తోంది. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో అందుబాటులో ఉండగా, భారత్‌లో ఇంకా అమలు కావాల్సి ఉంది.

టాప్ హెడ్ లైన్స్

NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget