అన్వేషించండి

AI Impact on Relationships: చాట్‌జీపీటీ కారణంగా భారత్‌లో బ్రేకప్‌లు, విడాకులు! రిలేషన్‌షిప్‌పై ఏఐ ఎఫెక్ట్!

AI Impact on Relationships: టెక్నాలజీ విప్లవం కేవలం పని ప్రదేశాలకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు బెడ్‌రూమ్‌లోకి వచ్చేస్తోంది. ఇది భారత్‌లో జంటల విడిపోవడానికి విడాకులకు కారణమవుతోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రస్తుతం, భాగస్వాములతో సంభాషణలకు, మానసిక ఊరట కోసం AI చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్నారు.
  • సంబంధాల సమస్యలలో గోప్యత కోసం, AIకి చెప్పడం సురక్షితంగా భావిస్తున్నారు.
  • AI ఎప్పుడూ వినియోగదారుని మెప్పించేలా సమాధానాలిచ్చి, విడిపోవాలనే నిర్ణయాన్ని బలపరుస్తుంది.
  • AI సలహాలతో సంబంధాలను తెంచుకొని, తర్వాత పశ్చాత్తాపపడుతున్నారు.

AI Impact on Relationships: ఈ మధ్య కాలంలో విడుదలైన లైక్ సినిమాలో టెక్నాలజీ ఆధారంగా సరిజోడీ వెతుక్కునే ప్రక్రియను చూసి అంతా ఆశ్చర్యపోయారు. లేటెస్ట్ ట్రెండ్ చూస్తుంటే మాత్రం అది నిజమనే నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా యూరప్ దేశాలలో భాగస్వాములు కేవలం సలహాల కోసమే కాకుండా, సాంగత్యం, మానసిక ఊరట కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఈ ధోరణి నెమ్మదిగా భారత్‌లోకి వచ్చేసింది. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

భారత్‌లో విడాకుల కేసులు, రిలేషన్‌షిప్ కౌన్సెలింగ్‌లలో ఏఐ ప్రస్తావన వస్తోంది. చాలా మంది జంటలు చాట్ జీపీటీ లాంటి వాటి వల్ల తన రిలేషన్ బ్రేక్ అయిందని చెబుతున్నారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులు,లేదా సన్నిహిత మిత్రులు ఇచ్చే సలహాల స్థానాన్ని ఇప్పుడు అల్గారిథమ్‌ భర్తీ చేస్తున్నాయి. 

రిలేషన్‌షిప్‌ సమస్యల్లో ఏఐని ఆశ్రయించడానికి ప్రధాన కారణం గోప్యత. విడాకులు లేదా బ్రేకప్‌ కావడం అనేది భారతీయ సమాజంలో ఇప్పటికీ సామాజికంగా కొంత భారంగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకుండా ఎటువంటి జడ్జిమెంట్‌ లేకుండా తన మనసులో మాట చెప్పుకోవడానికి చాట్ జీపీటి ఒక సురక్షితమైన వేదికగా ప్రజలకు కనిపిస్తోంది. 

అయితే ఇందులో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐకి సైకోఫాన్సీ అనే లక్షణం ఉంటుంది. అంటే అది ఎప్పుడూ యూజర్‌ను మెప్పించేలా సమాధానాలు ఇస్తుంది. మనం ఒక సమస్యను ఏ కోణంలో వివరిస్తే ఏఐ దానికి మద్ధతుగా నిలుస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన భాగస్వామి గురించి నెగిటివ్‌గా వివరిస్తే, ఏఐ ఆ అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఇది సమస్యను పరిష్కరించడానికి బదులు, విడిపోవాలనే నిర్ణయాన్ని మరింత దృఢం చేస్తుంది. 

చాలా మంది తమ రిలేషన్‌లో వచ్చిన సందేహాలకు చాట్‌జీపీటీ నుంచి వచ్చిన సమాధానాలతో ప్రభావితమై తమ రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెబుతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని పశ్చాత్తాపపడుతున్నారు. భాగస్వామి ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదా అపోహలు పెంచుకోవడానికి ఏఐ జనరేటెడ్ సమాధానాలను సాక్ష్యాలుగా చూపుతున్నారు. 

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

మానసిక వైద్య నిపుణులు, కౌన్సిలర్లు చెబుతున్న ప్రకారం ఏఐ అనేది కేవలం తాత్కాలికంగా మనసులోని బాధను చెప్పుకోవడానికి పనికి రావచ్చు కానీ అది వృత్తిపరమైన చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏఐ కేవలం అఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. కానీ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదు. సంబంధాల్లో సమస్యలు పునరావృతమవుతున్నప్పుడు వృత్తిపరమైన సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం 

భారతీయ చట్టాల ప్రకారం కేవలం ఏఐ చెప్పింది అనే కారణంతో విడాకులు తీసుకోవడం అసాధ్యం. భారతీయ న్యాయస్థానాలు ప్రవర్తను, సాక్ష్యాధారాల ఆధారంగానే పని చేస్తాయి. అయితే ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం లేదా మానసిక వేదనకు గురి చేయడం జరిగే అది మానసిక క్రూరత్వం కిందికి వస్తుంది. 

భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల విదేశాలతో పోలిస్తే ఇక్కడ విడాకులు తీసుకోవడం అనేది చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. కాబట్టి చాట్ జీపీటీ ప్రభావంతో విడాకులు తీసుకోవడం తక్కువే అయినప్పటికీ ప్రమాదం లేదని చెప్పలేమంటున్నారు నిపుణులు. ఏఐ అనేది అద్దం లాంటిదని, అది మనసులోని భావాలనే చూపిస్తుంది. ఆ ప్రతిబింబం స్పష్టంగా ఉందా లేదా వక్రీకరించి ఉందా అనేది గుర్తించాలని సూచిస్తున్నారు. 

Frequently Asked Questions

ప్రస్తుతం రిలేషన్‌షిప్‌ సమస్యలకు ఏఐ (AI) సహాయం తీసుకుంటున్నారా?

అవును, ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలలో ప్రజలు భాగస్వాముల సలహాల కోసం, మానసిక ఊరట కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ ధోరణి భారత్‌లోకి కూడా నెమ్మదిగా ప్రవేశించింది.

భారత్‌లో రిలేషన్‌షిప్‌ సమస్యలకు ఏఐని ఎందుకు ఆశ్రయిస్తున్నారు?

భారత్‌లో విడాకులు, బ్రేకప్‌లు సామాజికంగా ఇబ్బందికరంగా భావిస్తారు. గోప్యత, ఎటువంటి తీర్పు లేకుండా మనసులోని మాట చెప్పుకోవడానికి ఏఐ ఒక సురక్షితమైన వేదికగా కనిపిస్తోంది.

ఏఐ (AI) రిలేషన్‌షిప్‌ సమస్యలను పరిష్కరించడంలో ప్రమాదకరం అంటున్నారా?

అవును, ఏఐ ఎప్పుడూ యూజర్‌ను మెప్పించేలా సమాధానాలు ఇస్తుంది. ఇది సమస్యను పరిష్కరించడానికి బదులు, విడిపోవాలనే నిర్ణయాన్ని మరింత దృఢం చేస్తుంది.

ఏఐ (AI) సలహాలతో తీసుకున్న నిర్ణయాలపై పశ్చాత్తాపం కలుగుతుందా?

చాలా మంది ఏఐ సలహాలతో రిలేషన్‌షిప్‌లకు బ్రేకప్ చెప్పి, తర్వాత అసలు విషయం తెలుసుకొని పశ్చాత్తాపపడుతున్నారు. భాగస్వామి ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏఐ సమాధానాలను సాక్ష్యాలుగా చూపుతున్నారు.

న్యాయస్థానాలలో ఏఐ (AI) చెప్పిన దాని ఆధారంగా విడాకులు తీసుకోవచ్చా?

భారతీయ చట్టాల ప్రకారం కేవలం ఏఐ చెప్పింది అనే కారణంతో విడాకులు తీసుకోవడం అసాధ్యం. న్యాయస్థానాలు ప్రవర్తన, సాక్ష్యాధారాల ఆధారంగానే పని చేస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget