అన్వేషించండి

IT Jobs 2026: ఐటీ రంగంలో "ఏఐ" ప్రకంపనలు! క్యాంపస్ హైరింగ్‌కు కంపెనీలు బ్రేక్‌! 

IT Jobs 2026:ఏఐ రాకతో ఐటీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విప్రో తన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్‌పై ఆందోళన నెలకొంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విప్రో 2026-27 నుంచి ఫ్రెషర్ల క్యాంపస్ నియామకాలు నిలిపివేసింది.
  • AI, మెషిన్ల సామర్థ్యం పెరగడంతో మానవ వనరుల అవసరం తగ్గింది.
  • ఐటీ రంగం సంప్రదాయ నియామకాలు తగ్గించి, ప్రత్యేక నైపుణ్యాలపై దృష్టి పెడుతోంది.
  • AI నైపుణ్యాలున్న వారికి మెరుగైన అవకాశాలు, వేతనాలు లభిస్తున్నాయి.

IT Jobs 2026: దశాబ్దాల కాలంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐటీ రంగం ఒక బంగారు బాతులా కనిపించేది. కాలేజీ చివరి సంవత్సరంలో ఉండగానే వేలాది మందిని బల్క్‌గా కంపెనీలు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకునేవి. కానీ ఇప్పుడు ఆ మాస్‌ హైరింగ్‌ శకం ముగిసిందని విప్రో తీసుకున్న నిర్ణయం స్పష్టం చేస్తోంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతున్న వేళ ఐటీ కంపెనీలు మనుషుల సంఖ్య కంటే మెషిన్ల సామర్థ్యానికే పెద్ద పీట వేస్తున్నాయి. 

క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు విప్రో బైబై

భారత్ ఐటీ దిగ్గజం విప్రో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాన ఎలాంటి ఫ్రెషర్ క్యాంపస్ హైరింగ్ చేయడం లేదని ప్రకటించింది. ఈ నిర్ణయం ఐటీ నిపుణులను, విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. 

విప్రో చీఫ్ హ్యూమన్ ఆఫిసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ... ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి. మునుపటిలా రెవెన్యూ పెరగాలంటే వేలాది మంది కొత్త ఉద్యోగులు అవసరం లేదు. ఏఐ సాయంతో తక్కువ మందితోనే ఎక్కువ పనిని పూర్తి చేయవచ్చని కంపెనీ భావిస్తోంది. FY 26లో విప్రో కేవలం 7500 మంది ఫ్రెషర్లను మాత్రమే నియమించుకుంది. ఇది గతంలో పోలిస్తే చాలా తక్కువ. 

మొత్తం ఐటీ పరిశ్రమ ఏమంటోంది?

విప్రో తీసుకున్నది ఒక్క కంపెనీ నిర్ణయం మాత్రమే కాదు. ఇది భారత ఐటీ రంగం మొత్తం  అనుసరిస్తున్న కొత్త వ్యూహానికి సంకేతం. టీసీఎస్‌ కూడా గతంలో కంటే నియామకాలను నియంత్రించింది. ఇప్పటికే 25వేల క్యాంపస్ ఆఫర్లు ఇచ్చినా, డిమాండ్‌ను బట్టే తదుపరి అడుగులు వేస్తామని చెబుతోంది. ఏఐ, క్లౌడ్‌, సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక విభాగాలలో మాత్రమే ఇన్ఫోసిస్‌ హైరింగ్ చేస్తోంది. ఐబీఎం సుమారు 7,800 బ్యాక్‌ ఆఫీస్‌ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయాలని చూస్తోంది. సేల్స్‌ఫోర్స్‌ కూడా అదనపు ఇంజనీర్ల అవసరం లేదని, ఏఐ టూల్స్‌ అత్యంత వేగంగా చేస్తున్నాయి. గతంలో పది మంది చేసే పనిని ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సీనియర్ డెవలపర్లు ఏఐ సాయంతో పూర్తి చేయగలుగుతున్నారు. దీని వల్ల ఎంట్రీ లెవల్స్‌ జాబ్స్ లేదా ప్రెషర్లు అవసరం భారీగా తగ్గుతోంది. 

నాస్కామ్‌ చెప్పిందేంటీ? 

నాస్కామ్‌ 2026 స్ట్రాటజిక్ రివ్యూ ప్రకారం ఐటీ రంగం ఆదాయం పెరుగుతున్నా, ఉద్యోగాల కల్పన మాత్రం ఆ స్థాయిలో లేదు. కంపెనీల మొత్తం ఆదాయంలో ఏఐ వాటా ఐదు నుంచి ఆరు శాతానికి చేరింది. 2026 నాటికి పది లక్షల ఏఐ సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్ ఉండబోతోంది. కానీ అవి పాత పద్ధతుల్లో ఉండే ఉద్యోగాలు కావు. 

సవాళ్లతోపాటే అవకాశాలు

ఈ మార్పు వల్ల ఫ్రెషర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్న మాట నిజమే, సంవత్సానికి పదిహేను లక్షల మంది ఇంజినీర్లు గ్రాడ్యుయేట్లుగా వస్తున్నా, కేవలం నలభై శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఉద్యోగానికి పనికి వచ్చే స్కిల్ కలిగి ఉంటున్నారు. మాస్ రిక్రూట్‌మెంట్లు తగ్గిపోవడ వల్ల పోటీ విపరీతంగా పెరుగుతుంది. డిగ్రీ సర్టిఫికెట్ కంటే స్కిల్‌కే ప్రాధాన్యత లభిస్తుంది. బేసిక్ జావా, సీ వంటి లాంగ్వేజ్‌లు తెలిసినంత మాత్రాన ఉద్యోగం దొరకదు. 

ఏఐ స్కిల్ ఉన్న వారికి వేతనాల్లో 28 శాతం వరకు ప్రీమియం లభిస్తోంది. ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఏఐ ఆర్కెస్ట్రేటర్స్‌, హ్యూమన్‌- ఏఐ మేనేజర్లు వంటి కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. మొత్తంగా ఏఐ వల్ల 02 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితమైనా, 170 మిలియన్ కొత్త అవకాశాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి. 

Frequently Asked Questions

ఐటీ రంగంలో క్యాంపస్ నియామకాలు ఎందుకు తగ్గుతున్నాయి?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి వల్ల తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయవచ్చు. AI టూల్స్ వాడకం వల్ల ప్రెషర్ల అవసరం తగ్గింది.

విప్రో 2026-27 ఆర్థిక సంవత్సరానికి క్యాంపస్ నియామకాలు ఎందుకు చేయడం లేదు?

ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, AI వాడకం వల్ల ఎక్కువ మంది ఫ్రెషర్ల అవసరం లేదని విప్రో భావిస్తోంది.

AI వల్ల ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎలా మారుతున్నాయి?

AI వల్ల కొన్ని ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు తగ్గినప్పటికీ, AI-సంబంధిత కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. AI స్కిల్ ఉన్న వారికి వేతనాల్లో ప్రీమియం లభిస్తుంది.

ఐటీ రంగంలో ఉద్యోగం పొందడానికి ఏ నైపుణ్యాలు అవసరం?

కేవలం డిగ్రీ సర్టిఫికెట్ సరిపోదు, AI, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక విభాగాలలో నైపుణ్యాలకు ప్రాధాన్యత లభిస్తుంది. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి కొత్త నైపుణ్యాలు అవసరం.

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget