AI Refrigerators : ఇంటిని స్మార్ట్‌గా మార్చే AI రిఫ్రిజిరేటర్లు.. లాభాలు, నష్టాలు ఇవే
Smart Home : ఇంటిని ఆధునికంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఫ్రిడ్జ్‌ను AI ఆధారిత రిఫ్రిజిరేటర్‌తో రిప్లేస్ చేసుకోండి. మరి దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

AI Refrigerator Benefits : AI టెక్నాలజీ అన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పుడు ఇంటి ఉపకరణాల్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్లోకి వచ్చాయి AI ఆధారిత రిఫ్రిజిరేటర్లు. ఇంటిని స్మార్ట్‌గా మార్చుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. మీ ఇంటిని ఆధునికంగా మార్చుకోవడంలో ఇవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
AI ఆధారిత రిఫ్రిజిరేటర్లపై ఇప్పుడు భారతీయ వినియోగదారులు కూడా తెగ మొగ్గు చూపుతున్నారు. ఈ ఫ్రిడ్జ్‌లు కేవలం ఆహారాన్ని చల్లగా ఉంచడమే కాదు.. దానిని ఎక్కువకాలం తాజగా ఉంచేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మరి ఇది తెలివైన అప్‌గ్రేడ్ ఎలా అవుతుందో.. దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూసేద్దాం.
ఫీచర్లు
AI ఆధారిత ఫ్రిడ్జ్‌లలో అంతర్గత కెమెరాలు ఉంటాయి. అల్గారిథమ్‌లు లోపలి వస్తువులను గుర్తిస్తాయి. వాటి పరిమాణాలను ట్రాక్ చేస్తాయి. ఎక్స్పైరీ డైట్స్‌ని అలెర్ట్ చేస్తాయి. వ్యర్థాలను తగ్గించడంలో, భోజన ప్రణాళికను సులభతరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. కూలింగ్ సైకిల్స్‌ని ఆప్టిమైజ్ చేస్తాయి. ఎనర్జీ సేవింగ్ మోడ్స్‌ని ఇండికేట్ చేసి.. విద్యుత్ బిల్లును 10–20% తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అడ్వాన్స్డ్ కూలింగ్ టెక్నాలజీ ఫుడ్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండేలా చేస్తుంది.
కంట్రోల్స్
స్మార్ట్ ఫోన్ యాప్‌లు లేదా వాయిస్ అసిస్టెంట్లను రిమోట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఉష్ణోగ్రత, ఇతర నిర్వహణ అవసరాల అలెర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. తలుపు తెరిచి ఉంచినా.. లేదా సిస్టమ్‌లో లోపాలను ఏఐ ముందుగానే గుర్తిస్తుంది. వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. బ్రేక్డౌన్లను నివారిస్తుంది. కొన్ని మోడల్స్‌లో ఇంటర్నల్ స్క్రీన్స్, స్ట్రీమింగ్ వంటివి కూడా ఉంటాయి. హ్యాండ్స్ ఫ్రీ డోర్ ఓపెనింగ్, స్మార్ట్ రెసిపీలు, రింగ్ డోర్బెల్స్తో వస్తున్నాయి.
నష్టాలున్నాయా?
ఏఐ రిఫ్రిజిరేటర్లతో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీటిని రిపైర్ చేయించాలన్నా ఎక్కువ ఖర్చే అవుతుంది. ఫ్రిజ్‌లను హ్యాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల కెమెరాలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగమయ్యే అవకాశముంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ తొందరగా ఆగిపోవచ్చు. కూలింగ్ ఫంక్షన్ ఉన్నా సరే.. స్మార్ట్ ఫీచర్లు వాడుకలో లేకుండా పోతాయి.
టెక్ ఫ్రెండ్లీ వినియోగదారులకు AI రిఫ్రిజిరేటర్లు గేమ్ ఛేంజర్స్‌గా ఉంటాయి. ఖర్చు ఎక్కువగా ఉన్నా పర్లేదు.. ప్రైవసీ సమస్యలు పెద్దగా బాధించవు అనుకుంటే.. దీనితో మీ ఇంటిని హ్యాపీగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.






















