BSNL Rs 397 Plan: రూ.397కే ఐదు నెలల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా - బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్!
BSNL Best Prepaid Plan: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్తగా రూ.397 ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీని వ్యాలిడిటీ ఏకంగా ఐదు నెలలు కావడం విశేషం.
BSNL Vs Jio: దేశంలో ప్రైవేట్ కంపెనీలు ప్లాన్‌ల ధరలను పెంచడంతో వేలాది మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ప్రతిరోజూ కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. బీఎస్ఎన్ఎల్ కూడా దేశంలో తన నెట్‌వర్క్‌ను చాలా వేగంగా విస్తరించే పనిని ప్రారంభించింది.
బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఇప్పుడు మనం బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న కొత్త ప్లాన్ గురించి తెలుసుకుందాం. దీని ద్వారా మీరు ప్రతి రోజూ 2 జీబీ మొబైల్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ పొందుతారు. అదే సమయంలో దీని వ్యాలిడిటీ కూడా ఐదు నెలల వరకు ఉంటుంది.
రూ. 400 కంటే తక్కువ ధరలో...
ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ధర రూ. 397గా ఉంది. బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో సెకండరీ సిమ్‌గా ఉంచుకునే వారికి ఈ ప్లాన్ చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ చవకైన ప్లాన్ వ్యాలిడిటీ ఐదు నెలల వరకు ఉంది. అంటే మీరు ఒకసారి రీఛార్జ్ చేస్తే మరో 150 రోజుల వరకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
ప్లాన్ లాభాలు ఇవే...
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ. 397 ప్లాన్‌లో వినియోగదారులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 30 రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అంటే మీరు ఏ నెట్‌వర్క్‌కైనా కాల్ చేయవచ్చన్న మాట. అయితే కంపెనీ వినియోగదారులకు 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అంటే ఈ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత మీ నంబర్ క్లోజ్ అవుతుందనే టెన్షన్ నుంచి మీరు విముక్తి పొందుతారు.
మొదటి 30 రోజులు మీరు ప్రతిరోజూ 2 జీబీ మొబైల్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అదే సమయంలో డేటా లిమిట్ ముగిసిన తర్వాత మీరు 40 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పొందుతారు. మొదటి 30 రోజుల పాటు మీరు ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కూడా పొందుతారు. మీరు సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది.
జియో, ఎయిర్‌టెల్‌లో మీకు ఇంత తక్కువ ధరలో వ్యాలిడిటీ ప్లాన్లు అందుబాటులో ఉండవు. ఉన్న ప్లాన్ల ధర చాలా ఎక్కువగా ఉంది. దీని కారణంగా ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్‌కు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఉంది. బీఎస్ఎన్ఎల్‌కు గత కొన్ని నెలల్లో వినియోగదారులు కూడా బాగా పెరిగారు.
Next-Level Convenience at Your Fingertips! The #BSNLSelfcareApp is your all-in-one solution for landline, FTTH, and mobile services.
— BSNL India (@BSNLCorporate) August 30, 2024
Google Play: https://t.co/CVXLFIxtdH
App Store: https://t.co/0mzHyHZENB#BSNLOnTheGo #BSNL #DownloadNow #SwitchToBSNL pic.twitter.com/cs3onbCycq
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?