BSNL Unlimited Plan: ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ - ఎంతైనా వాడేసుకోవచ్చు!
బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ డేటాను అందించనుంది. దీని వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
ప్రస్తుతం మనదేశంలో చవకైన ప్రీపెయిడ్ ప్లాన్లు కావాలనుకునే వారికి భారత్త సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మంచి ఆప్షన్. జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) వంటి ప్రైవేట్ టెలికాంల తరహాలో కాకుండా ప్రీపెయిడ్ ప్లాన్ల ధరను కంపెనీ పెంచలేదు. బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ తరహాలో ప్రస్తుతం మిగతా నెట్‌వర్క్‌ల దగ్గర ఒక్క ప్లాన్ కూడా లేదు.
బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ లాభాలు
బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ డేటాను అందించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. వొడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్‌లో రూ.699 ప్లాన్ ద్వారా ఇటువంటి లాభాలను అందించనుంది. కానీ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చాలా ధర తక్కువగా ఉంది.
బీఎస్ఎన్ఎల్ ఇటీవలే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే రూ.2,022 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందించనున్నారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 300 రోజులుగా ఉంది. దీని ద్వారా 75 జీబీ డేటాను అందించనున్నారు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ లాభాలు కూడా లభించనున్నాయి.
బీఎస్ఎన్ఎల్ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్లాన్ 2022’ అనే పేరుతో ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. టెలికాం సంస్థ అందించే 75 జీబీ డేటా అయిపోతే నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. కానీ హైస్పీడ్ డేటా వ్యాలిడిటీ కూడా 60 రోజులుగానే ఉంది. ఈ 60 రోజుల తర్వాత కూడా ఇంటర్నెట్ ఉపయోగించుకోవాలంటే ప్రత్యేకంగా డేటా వోచర్లతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తం ప్లాన్ వ్యాలిడిటీ 300 రోజులుగా ఉంది.బీఎస్ఎన్ఎల్ రాబోయే 18 నుంచి 24 నెలల్లో 4జీ సర్వీసులను ప్రారంభించనుందని తెలుస్తోంది. 5జీ సర్వీసులు కూడా ఫైనల్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.
త్వరలో 5జీని లాంచ్ చేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ సర్వీసులను కూడా అందించే అవకాశం ఉంది. ఇది జరిగితే ప్రైవేట్ కంపెనీలకు దీటుగా బీఎస్‌ఎన్ఎల్ పోటీలోకి రాగలదు.
బీఎస్ఎన్ఎల్ దగ్గర రోజుకు 3 జీబీ డేటా అందించే ప్లాన్ కూడా ఉంది. అదే రూ.299 ప్లాన్. దీని ద్వారా రోజుకు 3 జీబీ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 90 జీబీ డేటాను ఈ ప్లాన్‌తో అందించనున్నారన్న మాట. ఎఫ్‌యూపీ లిమిట్ అయిపోయాక డేటా స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది.
ఇంటర్నెట్ లాభాలతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ఈ ధరలో ప్రైవేట్ టెల్కోలు అందించే ప్లాన్లతో పోలిస్తే ఈ ప్లాన్ దాదాపు రెట్టింపు లాభాలను అందిస్తుంది. కానీ బీఎస్ఎన్ఎల్‌కు 4జీ లేకపోవడం ఒక్కటే మైనస్.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!