అన్వేషించండి

BSNL Broadband Plans: జియో, ఎయిర్‌టెల్ పక్కనపెట్టండి - బీఎస్ఎన్ఎల్ ఇస్తున్న ఈ బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు తెలుసా?

Bharat Fiber Plans: బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల గురించి మీకు తెలుసా?

Bharat Fiber: మీరు జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు జియో ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ గురించి వినే ఉంటారు. కానీ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవ గురించి మీకు తెలుసా? ఎయిర్‌టెల్, జియో లాగానే బీఎస్ఎన్ఎల్ కూడా తన వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. ఈ సర్వీసు పేరు భారత్ ఫైబర్. బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ద్వారా వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడమే కాకుండా అనేక చవకైన, గొప్ప ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఐపీఎల్ సమయంలో మ్యాచ్‌లు చూడటానికి అలాంటి ప్లాన్లు చాలా ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

రూ.599 నుంచి ప్రారంభం
ఈ జాబితాలో మొదటి ప్లాన్ రూ. 599. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఒక నెల వ్యాలిడిటీని పొందుతారు. 60 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. అయితే ఇది పూర్తిగా అన్‌లిమిటెడ్ కాదు. కంపెనీ ఈ ప్లాన్‌లో తన వినియోగదారుల కోసం ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) పరిమితిని 3300 జీబీకి సెట్ చేసింది. అంటే నెల మొత్తం మీద 3300 జీబీ ఇంటర్నెట్ డేటాను 60 ఎంబీపీఎస్ వేగంతో పొందుతారు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ 60 ఎంబీపీఎస్ నుంచి 4 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రెండో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 699. ఈ ప్లాన్‌లో కూడా వినియోగదారులు ఒక నెల చెల్లుబాటుతో 60 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ సేవను పొందుతారు. ఈ ప్లాన్‌లో కూడా కంపెనీ తన వినియోగదారుల కోసం 3300 జీబీ ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) లిమిట్‌ను సెట్ చేసింది. మీరు ఒక నెలలో అంత కంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తే ఇంటర్నెట్ వేగం 60 ఎంబీపీఎస్ నుంచి 4 ఎంబీపీఎస్‌కి తగ్గుతుంది. అయితే ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు సంబంధించిన ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా బీఎస్ఎన్ఎల్ ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మీ సర్కిల్‌లోని బీఎస్ఎన్ఎల్ లిస్టింగ్‌ను చెక్ చేయడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

జియో ఫైబర్ చవకైన ప్లాన్
జియో ఫైబర్ అందిస్తున్న చవకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 399తో వస్తుంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఒక నెల పాటు 30 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌తో ఏ ఓటీటీ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ లభించబోదు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ చవకైన ప్లాన్
ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న చవకైన ప్లాన్ రూ. 499. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఒక నెల పాటు 40 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌తో కూడా ఏ ఓటీటీ యాప్ సబ్‌స్క్రిప్షన్ అందించలేదు.

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
Jimmy Carter Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Embed widget