Bitcoin Price: బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
Bitcoin Price Record: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో బిట్ కాయిన్ ధర పరుగులు పెట్టింది. ఆల్ టైం రికార్డు స్థాయిలో 75 వేల డాలర్ల మార్కును అందుకుంది.
Bitcoin All Time Record: బిట్ కాయిన్ ధర మరోసారి ఆల్ టైమ్ రికార్డు టచ్ చేసింది. చరిత్రలో మొట్టమొదటిసారి బిట్ కాయిన్ 75 వేల డాలర్ల మార్కును దాటింది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.63 లక్షలు అన్నమాట. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో క్రిప్టో మార్కెట్‌పై ఆసక్తి మళ్లీ పెరిగింది. దీంతో బిట్ కాయిన్ ధర ర్యాలీ అయింది. కేవలం కాసేపట్లోనే ఇది 10 శాతం పెరిగింది. ఊపు ఇలానే ఉంటే 2025 చివరి నాటికి బిట్ కాయిన్ లక్ష డాలర్ల మార్కును టచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమెరికా ఎన్నికలే కీలకం...
కేవలం ఈ సంవత్సరంలోనే కాకుండా ఇంతకు ముందు కూడా బిట్ కాయిన్ ధర పెరగడంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక పాత్ర పోషించాయి. 2009లో బిట్‌కాయిన్‌ను మొదటిగా తయారు చేశారు. ఆ తర్వాత మూడు సార్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సార్లూ బిట్ కాయిన్ ధర ఎన్నో సార్లు పెరిగింది. ఎప్పుడెప్పుడు ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం.
2012లో ఇలా...
2012 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన సంవత్సరంలోపే బిట్ కాయిన్ ధర ఏకంగా 10000 శాతం పెరిగింది. 11 డాలర్ల నుంచి ఒక్కసారిగా 1100 డాలర్లకు పెరిగింది.
2016లో ఇలా...
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాక 2017 డిసెంబర్‌లోపే బిట్ కాయిన్ ధర 700 డాలర్ల నుంచి ఒక్కసారిగా 18 వేల డాలర్ల వరకు పెరిగింది. అంటే దాదాపు 3600 శాతం గ్రోత్ అన్నమాట.
2020లో ఆల్ టైమ్ రికార్డ్
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాక కోవిడ్ వైరస్ పీక్‌లో ఉన్నప్పటికీ సంవత్సరంలోపే బిట్ కాయిన్ ధర ఏకంగా 478 శాతం పెరిగి 69 వేల డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ స్టార్ట్ అయ్యాక ఆల్ టైమ్ రికార్డు ఇదే.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
ఒకవేళ ఇది చారిత్రాత్మక ర్యాలీ కొనసాగితే బిట్ కాయిన్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ర్యాలీ సైజు తగ్గింది కానీ ట్రెండ్ మాత్రం పైకి వెళ్తూనే ఉంది. 2025 చివరి నాటికి 47.8 శాతం పెరిగి లక్ష డాలర్ల మార్కును బిట్ కాయిన్ ధర టచ్ చేస్తుందని తెలుస్తోంది.
ట్రంప్ గెలుపు ఊపునిస్తుందా?
ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రిప్టో ధరల ప్రభావం మనదేశం మీద కూడా పడే ప్రభావం ఉంది. ట్రంప్‌కు ఉన్న క్రిప్టో అనుకూల దృక్పథం వల్ల పెరుగుతున్న క్రిప్టో ధరల ప్రభావం భారత ఎకానమీపై నేరుగా ఎటువంటి ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే విధానం మీద ఇది ప్రభావం చూపిస్తుంది. ఇది మార్కెట్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ట్రంప్ అధికారంలో ఉండే ఈ నాలుగు సంవత్సరాలు క్రిప్టో మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుంది.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?