Youtube Alert : కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ బిగ్ అలర్ట్!
Youtube Alert :యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు అప్రమత్తం అవ్వాల్సిన టైం వచ్చింది. ఇదే విషయాన్ని YouTube నెటిజన్లకు హెచ్చరికలు జారీ చేసింది.

Youtube Big Alert For Content Creators: యూట్యూబ్ ఒకప్పుడు టైం పాస్ కోసం నెటిజన్లు దీన్ని ఓ ప్లాట్‌ఫామ్‌గా వాడుకునే వాళ్లు. ఇప్పుడు అది ఉపాధికి అడ్డాగా మారిపోయింది. కోట్ల మంది ఈ యూట్యూబ్‌ను వేదికగా చేసుకొని కోట్లు సంపాదించి జీవితంలో స్థిరపడిపోయారు. కొత్త కొత్తగా కంటెంట్ క్రియేట్ చేస్తూ ప్రజలను ఎంటర్‌టైన్ చేయడమే కాకుండా నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని కోట్ల కుటుంబాలు బాగుపడుతున్నాయి. అదే ప్లాట్‌ఫామ్‌లో మోసాలు చేసే వాళ్లు కూడా పుట్టుకొస్తున్నారు. దీనిపైనే క్రియేటర్లకు యూట్యూబ్ బిగ్ అలర్ట్ ప్రకటించింది. జాగ్రత్తగా ఉండకపోతే నష్టపపోతారని హెచ్చరిస్తోంది.
యూట్యూబ్ సీఈవో పేరుతో ఈ మధ్య కాలంలో చాలా మందికి మెయిల్స్, ఇతర మార్గాల్లో వీడియో వస్తోంది. ఇది నమ్మిన వారంతా వాటిపై క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇదే విషయాన్ని యూట్యూబ్‌కు మెయిల్స్ రూపంలో ఫిర్యాదులు చేస్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి వస్తున్న ఫిర్యాదులను గమనించిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటరర్లకు హెచ్చరికలుజారీ చేసింది.
YouTube CEO నీల్ మోహన్ వీడియో పేరుతో AI ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ వీడియోను సృష్టించారని గ్రహించింది. అందుకే అలాంటి వీడియోలు చూసి మోసపోవద్దని హెచ్చరిస్తోంది. వాళ్లు పంపించే లింక్స్‌పై క్లిక్ చేయవద్దని యూట్యూబ్ సూచించింది.
Also Read: భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
క్రియేటర్లతో ప్రైవేట్ షేరింగ్ ఉండదు
స్కామర్లు ఈ వీడియోను ప్రైవేట్‌గా షేర్ చేస్తున్నారని యూట్యూబ్ తెలిపింది. ఈ వీడియోలో మానిటైజేషన్ పాలసీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్కామర్లు ఈ వీడియో ద్వారా క్రియేటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి డబ్బు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. AI రూపొందించిన ఈ నకిలీ వీడియోలో నీల్ మోహన్ మానిటైజేషన్ విధానంలో మార్పుల గురించి మాట్లాడుతున్నట్లు ఉందని కంపెనీ తెలిపింది. ఇది ఫిషింగ్ స్కామ్‌గా తేల్చింది. దానిపై క్లిక్ చేయొద్దని రిక్వస్ట్ చేస్తోంది. లింక్‌పై క్లిక్ చేయడం వలన మీ సిస్టమ్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతుందని లేదా క్రియేటర్స్ వ్యక్తిగత సమాచారం స్కామర్‌లకు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రైవేట్ వీడియోలు కంపెనీ అడగదు
ప్రైవేట్ వీడియోల గురించి తమ ప్రతినిధులు ఎప్పుడూ క్రియేటర్లను సంప్రదించరని YouTube తెలిపింది. చాలా మంది ఫిషింగ్ స్కామర్లు YouTube పేరుతో క్రియేటర్లను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో కంపెనీ వివరించింది. అలాంటి వీడియోలను ఎప్పుడూ నమ్మవద్దు. తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఏదైనా లింక్‌పై క్లిక్ చేయవద్దని చెప్పింది.
చాలా మంది క్రియేటరర్లు ఈ మెయిల్స్ అందుకున్నారు
చాలా మంది కంటెంట్ క్రియేటరర్లు ఇలాంటి ఫేక్ మెయిల్స్ రిసీవ్ చేసుకున్నారు. వీటిని క్లిక్ చేస్తే ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయమని లేదా కొత్త మానిటైజేషన్ విధానాన్ని ఆమోదించమని కోరతారు. అలా చేయొద్దని యూట్యూబ్ రిక్వస్ట్ చేస్తోంది.
Also Read: డేటా సెంటర్లతో నీటి, విద్యుత్ కొరత- బిగ్ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చిన కేటీఆర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

