Bluetooth Earphones: హై-క్వాలిటీ ఆడియో, రూ.1500 లోపు ధర - 10 బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవే!
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలామంది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ. 1,500 ల్లోపు ధరలో లభించే 10 బెస్ట్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం..
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే వారిలో చాలా మంది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రూ. 1,500 లోపు బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.. ఇవి మీ బడ్జెట్‌కు సరిపోయేవి మాత్రమే కాకుండా మంచి బ్యాటరీ లైఫ్, నాయిస్ ఐసోలేషన్, వాటర్ రెసిస్టెన్స్ సహా అనేక రకాల ఫీచర్లను అందిస్తాయి. మీరు సంగీత ప్రేమికులైనా, ఫిట్ నెస్ ఔత్సాహికులైనా, హ్యాండ్స్-ఫ్రీ కమ్యూనికేషన్ అవసరమయ్యే వారైనా, ఈ ఇయర్ ఫోన్‌లు మీకు చక్కటి అనుభూతిని అందిస్తాయి.
రూ.1500 లోపు బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవే!
1. బోట్ రాకర్జ్ ట్రినిటీ
తాజాగా బోట్ కంపెనీ బోట్ రాకర్జ్ ట్రినిటీ బ్లూటూత్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 గంటల వరకు ప్లే టైమ్ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 24 గంటల ప్లేటైమ్‌ను ఆస్వాదించవచ్చు. క్రిస్టల్ బయోనిక్ సౌండ్, ENx టెక్నాలజీతో స్పష్టమైన వాయిస్ కాల్స్ పొందవచ్చు. ఆన్‌లైన్‌లో రూజ 1500 లోపు అత్యుత్తమ బ్లూటూత్ ఇయర్ ఫోన్‌లలో ఇది ఒకటి. జస్ట్ బ్లూ, కాస్మిక్ బ్లాక్, కచ్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఏడాది వారంటీ కూడా పొందవచ్చు.
2. JLab Go Air Pop True Wireless Bluetooth ఇయర్ బడ్స్
JLab Go Air Pop True Wireless Bluetooth ఇయర్ ఫోన్స్ ద్వారా చక్కటి మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. కాల్ క్లారిటీని పెంచే అంతర్నిర్మిత MEMల మైక్రోఫోన్ ను కలిగి ఉంటుంది. ఒక్క చార్జ్ తో 32+ గంటల ప్లేటైమ్, డ్యూయల్ కనెక్ట్, 15% చిన్న ఫిట్, EQ3 సౌండ్/టచ్ కంట్రోల్స్, ఆటో ఆన్, కనెక్ట్, IPX4 వాటర్ రిసిస్టెంట్ తో లభిస్తుంది. వారంటీ 2 సంవత్సరాలు ఉంటుంది.
3. JBL Tune 215BT
ఇవి 12.5mm డైనమిక్ డ్రైవర్‌ను కలిగి ఉంటాయి. చక్కటి సౌండ్ అందిస్తుంది. ఒక్క చార్జ్ తో 16 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. నలుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో లభిస్తాయి. మల్టీ-పాయింట్ కనెక్టివిటీ, 3 బటన్ రిమోట్, వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. వారంటీ 1 సంవత్సరం ఉంటుంది.
4. Realme TechLife Buds T100
ఇందులో ఉండే 10mm డైనమిక్ బాస్ ద్వారా చక్కటి మ్యూజిక్, వాయిస్ పొందవచ్చు. AI ENC టెక్నాలజీ, 28 గంటల ప్లేబ్యాక్ టైమ్, 88ms సూపర్ లో లేటెన్సీ, రియల్ HD సౌండ్, Realme లింక్ యాప్, Google ఫాస్ట్ పెయిర్ పొందే అవకాశం ఉంటుంది. నలుపు, నీలం రంగుల్లో ఉంటుంది. 1 సంవత్సరం వారంటీ పొందవచ్చు.
5. బోట్ ఎయిర్‌డోప్స్ 141
ఇది స్టైలిష్, ఫీచర్-ప్యాక్డ్ మోడల్. ఒక్క ఛార్జ్ తో 42 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ పొందే అవకాశం ఉంటుంది. కేవలం 5 నిమిషాల ఛార్జ్ తో 75 నిమిషాల వరకు ప్లే టైమ్‌ని పొందవచ్చు. ఇది బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్‌ఫోన్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ బ్లాక్, సైడర్ సియాన్, ప్యూర్ వైట్, సైబీరియన్ వైట్ రంగుల్లో లభిస్తుంది. 1 సంవత్సరం వారంటీ లభిస్తుంది.
6. బౌల్ట్ ఆడియో మావెరిక్ ట్రూలీ వైర్‌లెస్ బ్లూటూత్ 5.3
బౌల్ట్ ఆడియో మావెరిక్ అనేది ఫీచర్-రిచ్, హై-పెర్ఫార్మెన్స్ ఇయర్ బడ్స్ సెట్. చక్కటి లుక్, ఎర్గోనామిక్ డిజైన్ తో వస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 120 నిమిషాల ప్లేబ్యాక్ సమయాన్ని పొందవచ్చు. ఫుల్ ఛార్జ్ తో 35 గంటల ప్లే టైమ్ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్, LED లైట్లు, జెన్ టెక్నాలజీ, క్వాడ్ మైక్ ఉంటుంది. నలుపు రంగులో లభిస్తుంది. 1 సంవత్సరం వారంటీతో వస్తుంది.
7. Realme Buds Wireless 2 Neo
ఇది పెద్ద 11.2mm బాస్ బూస్ట్ డ్రైవర్‌తో ఆకట్టుకునే సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. మంచి బ్యాటరీ లైఫ్, మాగ్నెటిక్ ఇన్‌స్టంట్ కనెక్షన్, వాటర్ రిసిస్టెన్స్ తో వస్తుంది. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. ఇది నీలం, నలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో లభిస్తుంది. 1 సంవత్సరం వారంటీ ఉంటుంది.
8. Blaupunkt BTW100 KHROME Bassbuds
ప్రఖ్యాత జర్మన్ బ్రాండ్ నుంచి విడుదలైన స్టైలిష్ బ్లూటూత్ ఇయర్ బర్డ్స్. 30 గంటల ప్లేటైమ్, గేమింగ్ మోడ్, టర్బోవోల్ట్ ఛార్జింగ్, 13mm డ్రైవర్, స్టీరియో హై డెఫినిషన్ సౌండ్ ఉంటుంది. TurboVolt ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. నలుపు, తెలుపు రంగుల్లో 1 సంవత్సరం వారంటీతో లభిస్తుంది.
9. CrossBeats Neopods 300
హైపర్ బాస్™, గేమింగ్ మోడ్, గరిష్టంగా 40 గంటల ప్లే టైమ్, SnapCharge™ టెక్నాలజీ, టచ్ కంట్రోల్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉంటుంది. నలుపు రంగులో లభిస్తుంది. 1 సంవత్సరం వారంటీ ఉంటుంది.
10. BoAt Rockerz 255 Pro+
BoAt Rockerz 255 Pro+ చక్కటి వైర్‌లెస్ ఆడియో అనుభవాన్ని అందిస్తోంది. గరిష్టంగా 60 గంటల బ్యాటరీ బ్యాకప్, ASAP ఛార్జ్, 10mm డ్రైవర్లు, IPX7 రేటింగ్, డ్యూయల్ పెయిరింగ్, వాయిస్ అసిస్టెంట్ ను కలిగి ఉంటుంది. యాక్టివ్ బ్లాక్, ఫ్యూరియస్ బ్లూ, మెరూన్ మ్యాడ్‌నెస్, నేవీ బ్లూ, పర్పుల్ హేజ్, టీల్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. 1 సంవత్సరం వారంటీతో లభిస్తుంది.
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial