Asus Chromebook CM14: రూ.27 వేలలోపే అసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Asus New Chromebook: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త క్రోమ్‌బుక్‌ను మనదేశంలో తీసుకువచ్చింది.
Asus Chromebook CM14 Price in India: అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14 ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ కొంపానియో ప్రాసెసర్‌ను అందించారు. ఇది మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో రానుందని కంపెనీ తెలిపింది. 180 డిగ్రీల లే ఫ్లాట్ హింజ్డ్ డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. దీని ద్వారా వినియోగదారులు ల్యాప్‌టాప్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 15 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ల్యాప్‌టాప్ అందించనుంది. మనదేశంలో దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది.
అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14 ధర
అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14 ల్యాప్‌టాప్ ధరను మనదేశంలో రూ.26,990గా నిర్ణయించారు. గ్రావిటీ గ్రే కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఆరు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా లభించనుంది.
అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ యాంటీ గ్లేర్ నాన్ టచ్ ఎల్సీడీ స్క్రీన్ అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 220 నిట్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 16:9గానూ ఉంది. మీడియాటెక్ కొంపానియో 520 సీపీయూ ప్రాసెసర్ ద్వారా ఈ ల్యాప్‌టాప్ రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఉంది.
ఈ ల్యాప్‌టాప్‌లో 720పీ వెబ్‌క్యామ్ కెమెరా అందించారు. ప్రైవసీ షట్టర్, ఇన్‌బిల్ట్ ఫేస్ ఏఈ ఫీచర్ కూడా ఉంది. ఎర్గోనోమిక్ స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డును ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. టచ్‌ప్యాడ్ జెస్చర్ ఇన్‌పుట్‌ను సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఈ ల్యాప్‌టాప్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు. కెన్సింగ్టన్ నానో సెక్యూరిటీ స్లాట్, టైటాన్ సీ సెక్యూరిటీ చిప్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి.
ఇందులో 42డబ్ల్యూహెచ్ 2 సెల్ బ్యాటరీని అందించారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. రెండు యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-సీ పోర్టులు, ఒక యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-ఏ పోర్టు, 3.5 ఎంఎం 2 ఇన్ 1 మైక్రోఫోన్/హెడ్ ఫోన్ జాక్, మైక్రోఎస్‌డీ కార్డు రీడర్ కూడా ఉన్నాయి. దీని మందం 1.83 సెంటీమీటర్లు కాగా, బరువు 1.45 కేజీలుగా ఉంది.
మరోవైపు అసుస్ కొత్త గేమింగ్ ఫోన్ అసుస్ రోగ్ ఫోన్ 7 ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. అసుస్ రోగ్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై అసుస్ రోగ్ ఫోన్ 7 పని చేయనుంది. గత సంవత్సరం లాంచ్ అయిన అసుస్ రోగ్ ఫోన్ 6కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన అసుస్ రోగ్ ఫోన్ 7 ధరను రూ.74,999గా నిర్ణయించారు. స్టార్మ్ వైట్, ఫాంటం బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?