News
News
వీడియోలు ఆటలు
X

Apple iPhone 13: రూ.10 వేలు తగ్గింపుతో iPhone 13 - ఎక్కడ, ఎలా ఈ డిస్కౌంట్ పొందాలంటే..

ఆపిల్ ఐఫోన్ 13 ప్రస్తుతం ఆపిల్ స్టోర్ ఇండియా వెబ్ సైట్ లో రూ. 69.900 రూపాయల ప్రారంభం ధరకు లభ్యం అవుతోంది. కానీ, రూ. 10 వేల తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

FOLLOW US: 
Share:

 స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఐఫోన్ అంటే ఎంతో మక్కువ. ఎలాగైనా ఐఫోన్ వాడాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆపిల్ స్మార్ట్ ఫోన్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆపిల్ ఐఫోన్ ను ప్రస్తుతం రూ. 10 వేల తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఆపిల్ ఐఫోన్ 13పై రూ. 10 వేలకుపైగా తగ్గింపు  

ప్రసిద్ధ ఆన్ లైన్ స్టోర్ ఫ్లిప్‌ కార్ట్ ప్రస్తుతం తన ప్లాట్‌ ఫారమ్‌లో సమ్మర్ సేల్‌ ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ వస్తులపై భారీగా తగ్గింపు ధర అందిస్తోంది. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ ఫారమ్ 5G స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు ధరతో పాటు ఆకట్టుకునే ఆఫర్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌ కార్ట్‌ లో అందుబాటులో ఉన్న ప్రధాన మోబైల్స్ లో ఒకటి Apple iPhone 13. ఐఫోన్ అన్ని బ్యాంక్ ఆఫర్‌లను మినహాయించి రూ. 60,000 కంటే తక్కువ ధరకు విక్రయిస్తోంది.

వాస్తవానికి ఆపిల్ ఐఫోన్ 13 యాపిల్ స్టోర్ ఇండియా వెబ్‌ సైట్‌లో రూ.69,900 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. కానీ, ఫ్లిప్‌ కార్ట్‌ ఫ్లాట్ ఫారమ్ మాత్రం Apple iPhone 13ను రూ. 10 వేల తగ్గింపు ధరతో అందిస్తోంది.  ఫ్లిప్‌ కార్ట్‌ లో, ఐఫోన్ రూ. 58,999కి అందుబాటులో ఉంది. అంతేకాదు, మీ పాత ఐఫోన్‌ ను ఎక్సేంజ్ కోసం పెడితే,  ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ. 26,250 వరకు పొందవచ్చు. అయితే, ఈ బోనస్ అనేది పాత స్మార్ట్ ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.  iPhone 13తో పాటు, ఇతర స్మార్ట్ ఫోన్ లపైనా తగ్గింపు అందిస్తోంది.   

ఫ్లిప్‌ కార్ట్ సమ్మర్ సేల్ లో స్మార్ట్‌ ఫోన్‌లపై బెస్ట్ డీల్స్

Google Pixel 6A: ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో  రూ. 43,999కి లభిస్తోంది. ఫ్లిప్‌ కార్ట్  ప్రస్తుతం రూ. 28,999కి విక్రయిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ లపై రూ. 1,000 వరకు తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.

Nothing Phone (1):  భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 32,999 ప్రారంభ ధరతో లభిస్తోంది. అయితే, ఫ్లిప్‌ కార్ట్‌ లో రూ. 28,999కి అందుబాటులో ఉంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్న వినియోగదారులు కొనుగోలుపై అదనంగా రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు.

Samsung Galaxy Flip3: సామ్ సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ ప్రారంభ ధర రూ. 84,999 ఉండగా,  ప్రస్తుతం ఫ్లిప్‌ కార్ట్‌   రూ. 49,999కి విక్రయిస్తోంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 1,000 తగ్గింపు లభిస్తోంది.

Google Pixel 7 Pro: భారతదేశంలో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 84,999కి లభిస్తోంది. ఈ సేల్‌ లో ఫ్లిప్‌ కార్ట్‌  రూ.79,999కి అందిస్తోంది.

ముఖ్య గమనిక: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న ధరలకు, ఆన్‌లైన్ సేల్‌లో ప్రకటించే ధరల్లో మార్పులు ఉండవచ్చు. ప్రతి గంటకు ఆన్‌లైన్ సేల్‌లో ధరలు మారుతుంటాయి. అలాగే, ఆయా ప్రొడక్టులకు బ్యాంకులు ఇచ్చే రాయితీల్లో కూడా మార్పులు ఉండవచ్చు. ఇక్కడ పేర్కొన్న ధరల కంటే ఎక్కువ లేదా తక్కువ ధరలను అక్కడ చూపించవచ్చు.

Read Also: రూ.14 వేలలోపే శాంసంగ్ సూపర్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Published at : 19 Apr 2023 03:24 PM (IST) Tags: iPhone 13 Apple flipkart iPhone 13 discount

సంబంధిత కథనాలు

BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!

BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!

iQoo Neo 8: ఐకూ నియో 8 వచ్చేసింది - రూ.30 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

iQoo Neo 8: ఐకూ నియో 8 వచ్చేసింది - రూ.30 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

BGMI: పబ్జీ (బీజీఎంఐ) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ - బ్యాన్ ఎత్తేశారా?

BGMI: పబ్జీ (బీజీఎంఐ) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ - బ్యాన్ ఎత్తేశారా?

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?