Samsung M14 5G: రూ.14 వేలలోపే శాంసంగ్ సూపర్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త చవకైన 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే గెలాక్సీ ఎం14 5జీ.
Samsung Galaxy M14 5G: శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పటికే ఉక్రెయిన్‌లో లాంచ్ అయింది. గత కొన్ని వారాల నుంచి ఈ ఫోన్ గురించిన లీకులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 5ఎన్ఎం ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇందులో ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను రూ.13,490గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,990గా ఉంది. బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఇతర స్టోర్ల నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2408 x 1080 పిక్సెల్స్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 5 స్కిన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.
ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా 25W ఫాస్ట్ ర్యాపిడ్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. వాయిస్ ఫోకస్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను అవాయిడ్ చేయవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉంది. 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని మందం 0.94 సెంటీమీటర్లు కాగా, బరువు 206 గ్రాములుగా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్ ఫోన్ గత నెలలో మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,990గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,990గా నిర్ణయించారు.
ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఆక్టాకోర్ 5 ఎన్ఎం ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌ను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు.