అన్వేషించండి

Apple AirPods Pro 3 లాంచ్ చేసిన యాపిల్.. వినోదంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది, బుకింగ్స్ ప్రారంభం

Apple Event 2025లో కొత్త Airpods Pro 3 విడుదల చేసింది. డిజైన్ పాతగానే కనిపిస్తున్నా వీటిలో హార్ట్ బీట్ ట్రాకింగ్ ఫీచర్ తీసుకొచ్చింది యాపిల్. ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Apple Event 2025 Live Event: Apple వినియోగదారుల కోసం కంపెనీ ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్, సరికొత్త ఎయిర్ పాడ్స్ ప్రో3, స్మార్ట్ వాచ్‌లను యాపిల్ తీసుకొచ్చింది. అమెరికాలోని క్యూపర్టినోలోని Apple పార్క్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్ లో కంపెనీ AirPods Pro 3 ని విడుదల చేసింది. AirPods Pro 3 లో కొత్త ఆర్కిటెక్చర్ ఉపయోగించింది. ఇది యూజర్లకు ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది. ఇది గతంలోని ఎయిర్ పాడ్స్ తో పోలిస్తే రెట్టింపు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ విధానాన్ని కలిగి ఉంటుంది. ఇందులో లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా ఉంది. 

యాపిల్ AirPods Pro 3ని ఆరోగ్య సంబంధిత కొత్త ఫీచర్ తో రిలీజ్ చేసింది. ఈ ఎయిర్ పాడ్స్ తో ఆడియో వినడంతో పాటు హృదయ స్పందన (Heartbeat)ను కూడా ట్రాక్ చేయవచ్చు. Apple దీనిని హార్ట్-రేట్ ట్రాకింగ్ ఫీచర్ తో తయారు చేసింది. దాంతో పాటు లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో ఇంకా ఏమున్నాయో చూద్దాం.

గుండె చప్పుడు (Heartbeat)ను తెలుసుకోండి

కొత్త ఎయిర్ పాడ్స్ airpods Pro3 లో LED ఆప్టికల్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి రక్త ప్రవాహం ఆధారంగా హృదయ స్పందనను ట్రాక్ చేస్తాయని Apple సంస్థ తెలిపింది. ప్రధాన మార్పుగా Apple ఇయర్ బడ్స్ డిజైన్ ను సైతం కంపెనీ అప్ డేట్ చేసింది. దీనివల్ల ఇవి మునుపటి కంటే మెరుగ్గా పనిచేస్తాయి. దీని ఛార్జింగ్ కేసులో కూడా మార్పులు చేశారు. ఫిజికల్ బటన్లను తొలగించారు. AirPods 4 లాగే ఇందులో కొత్త టచ్ కంట్రోల్స్ ఇచ్చారు. దీని ద్వారా Apple ఇతర డివైజ్ లతో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. వినియోగదారులు వాటిని iPhone లేదా ఇతర Apple పరికరాలకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చని యాపిల్ పేర్కొంది.

కొత్త చిప్ సెట్ తో బెస్ట్ మోడ్

Apple AirPods Pro 3 ని కొత్త H3 చిప్ తో తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు ఎయిర్ పాడ్స్ ప్రో3 ద్వారా గతంలో కంటే మెరుగైన ఆడియో నాణ్యతను గమనిస్తారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. కంపెనీ కొత్త ఎయిర్ పాడ్స్ డిజైన్ లో పెద్దగా మార్పులు చేయలేదు. దాదాపు పాత సిరీస్ లాగానే కనిపిస్తుంది. 2026 లో ఎయిర్ పాడ్స్ ప్రో సిరీస్ కు పెద్ద అప్ గ్రేడ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. హార్డ్ వేర్ పరంగా వచ్చే ఏడాది యాపిల్ లాంచ్ ఈవెంట్లో పెద్ద మార్పులు చూడవచ్చని అనేక నివేదికలు వస్తున్నాయి.

యాపిల్ కొత్త ఎయిర్ పాడ్స్ ధర ఎంత?

AirPods Pro 3 ధర 249 డాలర్లుగా నిర్ణయించారు. యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో3ని ఇప్పుడు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget