Acer Predator Helios 300: హై పెర్ఫార్మెన్స్ గేమింగ్ ల్యాప్‌టాప్ లాంచ్ చేసిన ఏసర్ - ధర ఎంతంటే?
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏసర్ తన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది.
Acer Predator Helios 300 Price: ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ 300 ప్రీమియం గేమింగ్ ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో ఇంటెల్ కోర్ ఐ9 11వ తరం ప్రాసెసర్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. ఐదో తరం ఏరోబ్లేడ్ 3డీ టెక్నాలజీని ఇందులో అందించారు. 16 జీబీ డీడీఆర్4 ర్యామ్ ఇందులో ఉంది. 1 టీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు.
ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ 300 ధర
దీని ధరను రూ.1,44,999గా నిర్ణయించారు. మనదేశంలో సింగిల్ బ్లాక్ కలర్ ఆప్షన్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది.ఏసర్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఆథరైజ్డ్ రిటైల్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.దీనిపై ఒక సంవత్సరం ఇంటర్నేషనల్ ట్రావెలర్ వారంటీ కూడా అందించారు.
ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ 300 స్పెసిఫికేషన్లు
విండోస్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 15.6 అంగుళాల ఎల్ఈడీ బ్యాక్‌లిట్ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 360 హెర్ట్జ్ కాగా యాస్పెక్ట్ రేషియో 16:9గా ఉంది.
ఆక్టాకోర్ ఇంటెల్ కోర్ ఐ9 11వ తరం ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 16 జీబీ వరకు డీడీఆర్4 ర్యామ్, 1 టీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. ఇందులో వార్టెక్స్ ఫ్లో టెక్నాలజీని కూడా అందించారు. 720పీ హెచ్‌డీ ఆడియో, వీడియో రికార్డింగ్ వెబ్‌క్యాంను ఇందులో అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు స్పీకర్లు ఉన్నాయి. డీటీఎస్:ఎక్స్ అల్ట్రా ఆడియో, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్‌ను ఇవి అందించనున్నాయి.
బ్లూటూత్ వీ5.1, హెచ్‌డీఎంఐ పోర్టు, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, యూఎస్‌బీ 3.2 జెన్ 1 పోర్టు, యూఎస్‌బీ 3.2 జెన్ 2 పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఆఫ్‌లైన్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. వైఫై 6 కనెక్టివిటీని ఇందులో అందించారు. దీని టచ్‌ప్యాడ్ గెస్చర్స్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డు కూడా ఇందులో ఉంది. దీని బరువు 2.3 కేజీలుగా ఉండనుంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!