Kohli as T20 Captain: టీ20 కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులు ఇవే.. ఆ విషయంలో ఇప్పటికీ నంబర్ వన్
టీ20ల్లో కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే ఐసీసీ ట్రోఫీ లేదనే మచ్చ మాత్రం అలాగే ఉండిపోనుంది.
టీ20 వరల్డ్‌కప్‌లో నేడు నమీబియాతో టీమిండియా తలపడనుంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇదే ఆఖరి మ్యాచ్. టీ20ల్లో కెప్టెన్‌గా కోహ్లీకి కూడా ఇది ఆఖరి మ్యాచే. గొప్ప ఆటగాళ్లందరూ గొప్ప కెప్టెన్లు కాలేరు. కెప్టెన్‌గా విఫలం అయినంత మాత్రాన ఆటగాళ్లుగా వారు సాధించిన ఘనతలకు వంక పెట్టలేం. భారత క్రికెట్‌లో దేవుడుగా పేరు పొందిన సచిన్ టెండూల్కర్ కూడా కెప్టెన్‌గా విఫలం అయ్యాడు.
సాధారణ టోర్నీల్లో విరాట్ కెప్టెన్‌గా విజయవంతం అయినా.. ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోవడం బాధాకరం. 2016 టీ20 వరల్డ్ కప్, 2019 వన్డే వరల్డ్ కప్, ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్‌లతో పాటు 2021 టీ20 వరల్డ్ కప్‌లో కూడా భారత్ ట్రోఫీని సాధించలేకపోయింది.
అయితే ఐసీసీ ట్రోఫీతో పాటు ఐపీఎల్ కూడా విరాట్ గెలవలేకపోయాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ రికార్డులను తన పేరున రాసుకున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా మొత్తం 49 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా, 29 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. 16 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవగా.. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 1489 పరుగులు సాధించాడు. ప్రపంచంలో టీ20 కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో 1710 పరుగులతో ఆస్ట్రేలియాకు చెందిన అరోన్ ఫించ్ ఉన్నాడు.
విరాట్ కెప్టెన్ అయ్యాక 30 ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు సాధించాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫీట్. ఈ రికార్డును ఇంతవరకు ఎవరూ బద్దలు కొట్టలేదు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో టీ20 సిరీస్‌లు గెలిచిన ఏకైక భారతీయ కెప్టెన్ కోహ్లీనే. న్యూజిలాండ్‌పై ఏకంగా 5-0తో విజయం సాధించగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై 2-1తో టీమిండియా సిరీస్ విజయాలు సాధించింది.
విరాట్ టీమ్ సెలక్షన్, తను ఎంచుకునే వ్యూహాలపై ఎన్నో వివాదాలు నెలకొన్నప్పటికీ.. గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే కోహ్లీ మంచి కెప్టెన్‌గా నిలిచిపోనున్నాడు.
Also Read: Net Run Rate: ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?
Also Read: T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!
Also Read: Ravi Shastri: కొత్త ఐపీఎల్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి.. ఏ జట్టుకంటే?
Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్