India vs Namibia: నమీబియా మ్యాచులోనే రోహిత్‌కు కోహ్లీ పగ్గాలు అప్పిగిస్తే బెటర్! సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీకి నేడే ఆఖరి రోజు. కానీ నమీబియా మ్యాచులోనే రోహిత్‌కు అతడు పగ్గాలు అప్పగిస్తే మంచిదని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడుతున్నాడు.
నమీబియా మ్యాచులో టీమ్‌ఇండియాకు రోహిత్ శర్మ సారథ్య వహిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. కోహ్లీ ఇప్పుడే అతడికి పగ్గాలు అప్పగిస్తే కొత్త సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుందని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే తొలి, చివరి టీ20 ప్రపంచకప్ అని వెల్లడించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా నేడు నమీబియాతో తలపడుతోంది. ఇప్పటికే పాక్, న్యూజిలాండ్ సెమీసుకు వెళ్లిపోవడంతో ఈ మ్యాచుకు విలువ లేకుండా పోయింది. ఈ టోర్నీ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్ చెప్పేశాడు. రవిశాస్త్రికీ కోచ్‌గా ఇదే చివరి సిరీసు. దాంతో రోహిత్‌కు ఇప్పుడే నాయకత్వం అప్పగిస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు.
'టీ20 క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త సంప్రదాయం మొదలుపెట్టేందుకు కోహ్లీకి ఇదే మంచి అవకాశం. ప్రపంచకప్ ఆఖరి మ్యాచులో నేరుగా రోహిత్‌కు అతడు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుంది. ఇక హిట్‌మ్యాన్ విశ్రాంతి లేకుండా కెప్టెన్‌గా కొనసాగుతాడు' అని మంజ్రేకర్ అన్నాడు.
'ఏదేమైనా ఒక కథ ఇక్కడితో ముగుస్తోంది. విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఇదే తొలి, ఆఖరి టీ20 ప్రపంచకప్. మళ్లీ ఈ ఫార్మాట్లో అతడు నాయకుడిగా కనిపించడు. శాస్త్రి, కోహ్లీ జంటకూ ఇదే ఆఖరి మజిలీ. కెప్టెన్‌గా కోహ్లీకి ఇదో నిరాశాజనక ప్రదర్శన' అని సంజయ్ పేర్కొన్నాడు.
రవిశాస్త్రి మళ్లీ టీమ్‌ఇండియా కోచ్‌గా కనిపించడని మంజ్రేకర్ అన్నాడు. ఐసీసీ ట్రోఫీలు, ప్రపంచకప్‌ల గురించి మాట్లాడితే అతడు ఒక్కటైనా గెలిస్తే బాగుండేదని పేర్కొన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్, టీ20 ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏదో ఒకటి గెలిస్తే సంతృప్తిగా ఉండేదన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కనీసం సెమీస్‌కు అర్హత సాధించకపోవడం నిరాశ కలిగించేదని వెల్లడించాడు. ప్రపంచకప్ ముగియగానే శాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ కోచ్ అవుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Net Run Rate: ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?
Also Read: T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!
Also Read: Ravi Shastri: కొత్త ఐపీఎల్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి.. ఏ జట్టుకంటే?
Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్