అన్వేషించండి
Advertisement
Paris Paralympics 2024: పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి
Paris Olympics 2024: పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. 29 పతకాలు సాధించి అద్భుతం చేశారు. దీంతో కేంద్రం అథ్లెట్లకు ప్రోత్సహకాలు ప్రకటించింది.
Paralympics medallists felicitated: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో భారత అథ్లెట్లు అంచనాలు అందుకోలేక విఫలమైన చోటే.. పారా అథ్లెట్లు సత్తా చాటారు. పారాలింపిక్స్(Paralympics 2024) చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 29 పతకాలు సాధించి అద్భుతం చేశారు. ఇప్పటివరకూ టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు సాధించింది. ఇప్పటివరకూ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ పతకాల రికార్డును పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు కాల గర్బంలో కలిపేశారు. టార్గెట్ 25 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత పారా అథ్లెట్లు... ఆ లక్ష్యం కంటే ఎక్కువ పతకాలే సాధించారు. పారిస్‌లో మొత్తం 84 మందితో కూడిన భారత బృందం బరిలోకి దిగగా... 29 పతకాలు వచ్చాయి. భారత్ ఖాతాలో 7 స్వర్ణ పతకాలు.. 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ 18వ స్థానంలో నిలిచింది. పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ప్రభుత్వం, పారిశ్రామిక దిగ్గజాలు నజరాన ప్రకటిస్తున్నాయి. కేంద్రం కూడా అథ్లెట్లకు ప్రోత్సహకాలు ప్రకటించింది.
#Paralympics2024 में अपने उत्कृष्ट प्रदर्शन से हम सभी को गौरव के अनेकों क्षण प्रदान करने वाले हमारे पैरा एथलीटस् व उनके प्रशिक्षकों के स्वदेश लौटने पर उनसे मुलाकात कर उन्हें बधाई व शुभकामनाएं दी।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 10, 2024
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का खेलों के प्रति सकारात्मक दृष्टिकोण का… pic.twitter.com/4TKqG5I4hH
ఎంత ఇచ్చారంటే..
ఢిల్లీలో పారాలింపిక్స్ పతక విజేతలను కేంద్ర క్రీడామంత్రి మన్‌సుఖ్ మాండవియా(Dr. Mansukh Mandaviya) ఘనంగా సన్మానించారు. పతకాలతో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన అథ్లెట్లకు నజరానాలు కూడా ప్రకటించారు. పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులకు రూ.75 లక్షల ప్రోత్సాహకం ప్రకటిస్తున్నట్లు మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. సిల్వర్ మెడల్ గెలిచిన వారికి రూ.50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.30 లక్షలు నగదు బహుమతి అందజేస్తామని మాండవీయ తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాండవీయ మరో కీలక ప్రకటన చేశారు. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగే పారాలింపిక్స్ లో ఇప్పుడు సాధించిన పతకాల కంటే ఎక్కువ మెడల్స్ సాధించేలా అథ్లెట్లకు సంపూర్ణ మద్దతు అందిస్తామని వెల్లడించారు. పారా అథ్లెట్లకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న ఆయన... ప్రపంచ క్రీడా వేదికపై ఇటీవల భారత ప్రదర్శన అత్యుత్తమంగా ఉందని కొనియాడారు.
భారీ పురోగతి
2016లో జరిగిన పారా ఒలింపిక్స్‌లో భారత్ కేవలం నాలుగంటే నాలుగే పతకాలు సాధించింది. ఆ తర్వాత 2020లో టోక్యో వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో టీమిండియా 19 పతకాలు సాధించి పర్వాలేదనిపించింది. పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో మాత్రం భారత అథ్లెట్లు అద్భుతమే చేశారు,. పారిస్‌లో 29 పతకాలతో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ పారాలింపిక్స్‌తో ఇండియా మొత్తం పతకాల సంఖ్య 50 చేరింది. సారి భారతదేశం ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ ఏకంగా 17 పతకాలు గెలిచింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
కర్నూలు
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion