అన్వేషించండి
Advertisement
Duleep Trophy: దేశవాళీలో ఒక్కరోజుకు , క్రికెటర్లకు మ్యాచ్ ఫీజ్ ఎంతిస్తారంటే ?
Duleep Trophy: స్టార్ ఆటగాళ్లు, జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లు దేశవాళీలో ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో బీసీసీఐ మ్యాచ్ ఫీజులతో పాటు ప్రైజ్ మనీలను భారీగా పెంచింది.
How Much Money Do Players Earn From Playing In Duleep Trophy: దులీప్ ట్రోఫీ(Duleep Trophy) రసవత్తరంగా సాగుతోంది. నాలుగు జట్లు టైటిల్ కోసం గట్టిగానే పోరాడుతున్నాయి. మాములుగా అయితే దేశవాళీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఈసారి స్టార్ ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో అడుతుండడంతో క్రికెట్ అభిమానుల దృష్టి ఈ దేశవాళీ టోర్నీపైనే ఉంది. భారత్‌కు వచ్చే సీజన్ చాలా కీలకంగా మారనుంది. బంగ్లాదేశ్(Bangladesh) సిరీస్‌తో పాటు... ఆస్ట్రేలియా(Australia) సిరీస్‌లు భారత్‌కు సవాల్ విసరనున్నాయి. అయితే దులీప్ ట్రోఫీలో ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజ్ ఎంత ఇస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. అసలు దులీప్ ట్రోఫీలో మ్యాచ్ ఫీజ్ ఎంతిస్తారంటే...?
పెరిగిన ప్రైజ్ మనీ
బీసీసీఐ ఇటీవల దేశవాళీలో ఆడే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను, ప్రైజ్ మనీలను భారీగా పెంచింది. స్టార్ ఆటగాళ్లు, జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లు దేశవాళీలో ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో బీసీసీఐ మ్యాచ్ ఫీజులతో పాటు ప్రైజ్ మనీలను భారీగా పెంచింది. దులీప్ ట్రోఫీ ప్రైజ్ మనీని 2023లో రూ.50 లక్షలు ఉండేది. కానీ ఇప్పుడు దులీప్ ట్రోఫీ విజేతకు రూ. కోటీ ప్రైజ్ మనీ అందిస్తారు. రన్నరప్‌లకు రూ. 50 లక్షలు లభిస్తాయి.
రోజుకు రూ.60 వేలపైనే
దులీప్ ట్రోఫీలో ఆడుతున్న క్రికెటర్ల ఎంత ఇస్తారో అనేది మాత్రం కచ్చితమైన వివరాలు తెలియడం లేదు. కానీ మ్యాచ్ ఫీజ్ వివరాలు తెలవకపోయినా రంజీ ట్రోఫీలో ఎంతైతే ఇస్తున్నారో అంతే ఇచ్చే అవకాశమైతే ఉందని మాత్రం తెలుస్తోంది. అయితే రంజీ ట్రోఫీలో ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా ఆటగాళ్ల ఒక్క రోజు మ్యాచ్ ఫీజును నిర్ణయిస్తారు. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం 41 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచులు ఆడిన ఆటగాళ్లకు ఒక్క రోజుకు రూ.60,000లను మ్యాచ్ ఫీజ్‌గా ఇస్తున్నారు. 21 నుంచి 40 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ళకు ఒక రోజుకి రూ. 50,000 పొందుతున్నారు. 20 లేదా అంతకంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ళు రోజుకు రూ. 40,000 మ్యాచ్ ఫీజ్ కింద అందుకుంటున్నారు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్న ఆటగాళ్లు కూడా వారు రంజీ ట్రోఫీలో ఎన్ని మ్యాచులు ఆడారనే దానిపై మ్యాచ్ ఫీజ్ అందుకుంటున్నారు. ఉదాహరణకు దులీప్ ట్రోఫీలో అద్భుత శతకంతో మెరిసిన ముషీర్ ఖాన్.. ఒక రోజుకు రూ.40 వేలు మ్యాచ్ ఫీజుగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే ముషీర్ ఖాన్.. రంజీ ట్రోఫీలో కేవలం అయిదు మ్యాచులే ఆడాడు. అందుకే అతడు ఒకరోజు మ్యాచ్ ఫీజ్ కింద రూ. 40 వేలు తీసుకుంటాడు. ముషీర్ ఖాన్ నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్‌ను మొత్తం ఆడితే గరిష్టంగా రూ. 4,80,000 సంపాదించే అవకాశం ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion