Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Duleep Trophy In Anantapur | ఇండియా ఏ, ఇండియా బీ జట్లు దులీప్ ట్రోఫీలో భాగంగా మ్యాచ్ ఆడేందుకు బెంగళూరు నుంచి అనంతపురం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.
INDIA A and INDIA B teams reached Anantapur | అనంతపురం: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి సంబంధించి ఇండియా టీమ్ ఏ, టీమ్ బి జట్లు సోమవారం బెంగళూరు నుండి అనంతపురం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా దులీప్ ట్రోఫీ నిర్వహిస్తున్నాయి. అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియా ' బీ ' జట్టు క్రీడాకారులకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉమెన్స్ ఆపరేషన్ మేనేజర్ మచ్చా రామలింగారెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లాజిస్టిక్ మేనేజర్ గౌరీ శంకర్, యుగంధర్ రెడ్డి, తదితరులు స్వాగతం పలికారు.
ఇండియా ఏ జట్టు :
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ఎస్.కె. రషీద్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షయ్ వాడ్కర్, థనుష్ కోటియన్, షమ్స్ ములానీ, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, కుమార్ కుషర్గా, శాశ్వత్ రావత్, అక్విబ్ ఖాన్, ప్రథమ్ సింగ్, సునీల్ జోషి (కోచ్).
ఇండియా బి జట్టు-
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రింకూ సింగ్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, ఆర్. సాయి కిషోర్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, సుయాష్ ప్రభుదేశాయ్, రాహుల్ చాహర్, ఎన్. జగదేసన్, హిమాన్షు మంత్రి, సౌరాశిష్ లహరి, మోహిత్ అవస్తి, జర్ణయిల్ సింగ్,
సితాన్షు కోటక్ ( కోచ్).
ఇటీవల ఇండియా ఏ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా బీ జట్టు 76 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా బీ 321 కి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 184 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఏ 231 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 198 రన్స్ చేసి కుప్పకూలడంతో ఇండియా బీ గెలుపొందింది.
ఇండియా డీ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా సీ టీమ్ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులు చేసిన ఇండియా డీ, రెండో ఇన్నింగ్స్ లో 236కు ఆలౌటైంది. ఇండియా సీ తొలి ఇన్నింగ్స్ 168 రన్స్ చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 233 రన్స్ చేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.