అన్వేషించండి
Advertisement
Vinesh Phogat: ఆసుపత్రిలో చేరిన వినేశ్ ఫొగాట్- బరువు తగ్గడం కోసం రాత్రంతా వర్కౌట్స్
Vinesh Phogat Disqualified: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఆసుపత్రి పాలయ్యారు.
Vinesh Phogat hospitalised in Paris due to dehydration: భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు. బరువు తగ్గడం కోసం వినేశ్ రాత్రంతా స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ చేశారు. దీంతో ఆమె ఒక్క రాత్రే కేజీకి పైగా బరువు తగ్గారు. మరోవైపు 50 కేజీల విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఆమెపై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. 50 కేజీల కంటే బరువు ఎక్కువగా ఉండడంతో వినేశ్ ఫొగాట్.. రాత్రంతా కసరత్తులు చేస్తూనే ఉన్నారు. రాత్రంతా నిర్విరామంగా ఎక్సర్‌సైజ్ చేస్తూనే ఉంది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. తన పతకం నిలుపుకునేందుకు వినేశ్ చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. కానీ వినేశ్ పోరాటాన్ని మెచ్చుకుంటా భారత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Vinesh Phogat will be placed last as per UWW rules: Sources pic.twitter.com/jr74Z2E1Kc
— IANS (@ians_india) August 7, 2024
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement